గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో
ట్రామా వైద్య సేవలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రమణ అన్నారు. ఏడు జిల్లాలకు చెందిన రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర చికిత్సల కోసం ఇక్కడికి వస్తుంటారని గుర్తుచేశారు. సకాలంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. జీజీహెచ్‌లో ట్రామా ఆపరేషన్ థియేటర్ సత్వర నిర్మాణానికి కృషి చేస్తానని వెల్లడించారు. బుధవారం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎస్.ఎస్.వి.రమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీజీహెచ్‌కు పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలు వైద్య విభాగాలకు ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు.
గుంటూరు జీజీహెచ్ పూర్వ వైభవానికి కృషి
సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ
Comments
Please login to add a commentAdd a comment