పల్నాడు
గురువారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
ఘనంగా మాసశివరాత్రి వేడుకలు
నకరికల్లు: నర్శింగపాడులో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, మరకత
లింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయాల్లో మాసశివరాత్రి వేడుకలు బుధవారం
ఘనంగా నిర్వహించారు.
పోలీస్ అమరవీరులకు నివాళులు
మేడికొండూరు: పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగంగా పేరేచర్ల జంక్షన్‌లో బుధవారం రాత్రి శ్రద్ధాంజలి ఘటించారు. సీఐ మీరా సాహెబ్, సిబ్బంది పాల్గొన్నారు.
శివాలయంలో చండీ హోమం
కొల్లిపర: స్థానిక ప్రసిద్ధ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీముక్తేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అమావాస్య చీకటిని జయించి సంతోషాలను పూయించే పండుగ దీపావళి. ఈ నెల 31న నరక చతుర్దశి (దీపావళి) సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య కాంతుల పండగను జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ టపాసుల్ని వినియోగించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా వెదజల్లాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా ప్రకృతికి మేలు చేసేలా సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరుతున్నారు. – సత్తెనపల్లి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. బంధుమిత్రులకు మిఠాయిలు పంచడం, ఇంటికి విద్యుత్ కాంతులు వెదజల్లేలా అలంకరణ చేసుకోవడంతో పాటు వివిధ ఆకృతుల్లో ఉండే ప్రమిదల్ని వెలిగించాలి. ఒకవేళ పిల్లలు బాణసంచా కావాలని మారాం చేస్తే వాటిని కాల్చడం వల్ల కలిగే నష్టాల్ని వివరించి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాలి.
● కొత్త సంప్రదాయానికి స్వాగతం పలుకుదాం ● పర్యావరణ హితంగా పండగ జరుపుకుందాం ● ఎకో టపాసులతో పర్యావరణానికి మేలు
● రసాయన టపాసులతో ధ్వని, వాయు కాలుష్యాలు ● ఆరోగ్యానికి హానికరం
రంగులు విరజిమ్ముతూ పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే టపాసులు లేకుండా దీపావళి పండుగ పూర్తి కాదనుకుంటారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బాణసంచాలో వాడే రసాయనాలు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ ఎకో ఫ్రెండ్లీ కాకర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్‌ఫెట్టీ, ఫ్లవర్ పవర్, ఫేక్ నోట్, బర్డ్స్, స్నేక్ మిక్స్, ఫ్లవర్ పార్ట్స్, పెన్సిల్ లాంటి పేర్లతో మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణసంచాలా వాతావరణానికి పెద్దగా హాని కలిగించవు. వీటిని ధ్వని పరిమిత దూరం వరకే ఉంటుంది. కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. గన్ పౌడర్, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వైరెటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు.
టపాసుల్లో పలు రసాయనాలు
బాణసంచా తయారు చేయాలంటే రసాయనాల్ని వాడాల్సిందే. కాపర్, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, జింక్, సోడియం, అల్యూమినియం, అమ్మోనియం, పొటాషియం, సల్ఫర్, బొగ్గు వాడతారు. ఒక్కో రకం టపాసును తయారు చేసేందుకు ఒక్కో రసాయనాన్ని వినియోగిస్తారు.వీటిని కాల్చినప్పుడు అందులోని రసాయనాలు మండి విషపూరిత వాయువులు విడుదలవుతాయి. వాటిని పీల్చితే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పూర్తిగా బాణసంచాను కాల్చడం నిషేధించాలంటూ గతంలో ముగ్గురు చిన్నారులు తరఫున వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. బాణసంచాను పూర్తిగా నిషేధించడం అసాధ్యమని ఉన్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంటూ, కొన్ని పరిమితులను విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య టపాసులు కాల్చరాదని, భారీ శబ్దాలు చేసే వాటిని కాల్చకూడదని సూచించింది. ప్రత్యేకించి పండుగ రోజుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని తీర్పులో ఆదేశించింది. దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రోజులో ఏవైనా రెండు గంటల పాటు కాల్చుకోవచ్చని సడలింపు ఇచ్చింది. బాణసంచాల వల్ల పర్యావరణాన్ని కలిగే నష్టాలపై సమాజంలో చైతన్యం తీసుకు రావాల్సిందిగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
న్యూస్‌రీల్
రసాయనాలు వల్ల కలిగే ఇబ్బందులు...
మట్టి ప్రమిదలే ముద్దు
సుప్రీం కోర్టు పరిమితులు
Comments
Please login to add a commentAdd a comment