అవతరణ దినోత్సవంలో పిడుగురాళ్ల కవి రచనకు చోటు | - | Sakshi
Sakshi News home page

అవతరణ దినోత్సవంలో పిడుగురాళ్ల కవి రచనకు చోటు

Published Thu, Oct 31 2024 2:26 AM | Last Updated on Thu, Oct 31 2024 2:26 AM

-

పిడుగురాళ్ల: రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఏర్పాటైన గానలహరిలో తన రచనకు చోటు దక్కడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పిడుగురాళ్లకు చెందిన కవి వైహెచ్‌కే మోహన్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఏర్పాటైన గానలహరిలో ‘‘జయహో జయ జయహో జయ జయహో జననీ, శుభమస్తు..విజయోత్సవం భావని ఆంధ్రావని’’. అంటూ సాగే తన రచనకు చోటు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రాశస్త్యాన్ని ఆవిష్కరించే వివిధ అంశాలు ఈ గీతంలో ఉంటాయన్నారు. ప్రజా గాయకుడు, అమరావతి సాంస్కృతిక కన్వీనర్‌ పీవీ రమణ తన గీతానికి బాణి, సంగీతాన్ని సమకూర్చి తన గాయక బృందంతో కలిపి ఆలపించారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement