ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవో హోం హాల్‌లో ఉద్యమ అధ్యయన తరగతులు ఆదివారం జరిగాయి. చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ఆరు నెలల నుంచి ఉపాధ్యాయులు దాచుకున్న పీఎఫ్, ఏపీజిఎల్‌ఐ బకాయిలు రూ.కోట్లలో నిలిచాయని పేర్కొన్నారు. వాటిని సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు, 90 నెలల పెండింగ్ డీఏలను ఎప్పుడు విడుదల చేసేది ప్రభుత్వం చెప్పాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు పనిభారంగా మారిన యాప్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అపార్‌లో వస్తున్న ఇబ్బందులు తొలగించి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగవరప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్.జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ఖలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment