ఉత్తమ లేఖలకు బహుమతులు
బెల్లంకొండ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాల ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల నిమిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు కలం తీసుకొని లేఖలు రాసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పటి సమాచార సాధనాన్ని నేటి తరానికి తెలియజేయడానికి ‘డిజిటల్ యుగంలో లేక రచన ఆవశ్యకత’ అనే అంశంపై లేఖల పోటీలకు తపాలా శాఖ ఆహ్వానం పలుకుతుంది.
ఈ పోటీలకు 18 ఏళ్ల లోపు ఒక కేటగిరి, 18 ఏళ్లు పైబడిన వారిని మరో కేటగిరీగా విభజించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్ తదితర అంశాలను పొందుపరచాలి. చేతితో రాసిన వ్యాసం మాత్రమే అనుమతిస్తారు. ఎన్వలాప్ కవర్ అయితే వెయ్యి పదాలు మించరాదు. ఇన్‌లాండ్ లెటర్ అయితే 500 పదాలు మించకుండా రాయల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలు ది పోస్టల్ సూపరింటెండెంట్, ప్రధాన తపాలా కార్యాలయం, నరసరావుపేట చిరునామాకు డిసెంబర్ 14వ తేదీ లోపు పంపాలి.
రాష్ట్ర, జాతీయ స్థాయిలలో బహుమతులు..
విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి అందజేస్తారు. సర్కిల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు వరుసగా రూ.25వేలు, రూ.10వేలు, రూ.5వేలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం రూ.50వేలు, ద్వితీయ స్థానం రూ.25వేలు, తృతీయ స్థానం విజేతకు రూ.10వేలు అందజేయనున్నారు.
తపాలా శాఖ ఆధ్వర్యంలో లేఖ రచన పోటీలు
డిసెంబర్ 14 వరకూ గడువు
Comments
Please login to add a commentAdd a comment