బాలల రక్షణ చట్టాల అమలు కీలకం
నగరంపాలెం: బాలల రక్షణ చట్టాలను అమలు పరచడంలో ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎ.ఎస్.బి.జి.పార్థసారథి అన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం మండల, మున్సిపల్ స్థాయిలో బాల్య వివాహ నిషేధ అధికారులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. జిల్లా మహిళాశిశు అభివృద్ధి సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమన్వయంతో కార్యక్రమం ఏర్పాటైంది. అధ్యక్షత వహించిన సంస్థ కార్యదర్శి టి.లీలావతి అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధం చట్టం గురించి జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ విజయ్‌కుమార్ వివరించారు. జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సంస్థ నోడల్ అధికారిణి వాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం న్యాయ, పర్యవేక్షణాధికారిణి బి.వాసంతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment