విద్యార్థులు క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
వర్సీటీ మహిళా ఖోఖో టోర్నీ ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థి దశలో క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవటం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని విక్టరీ డిగ్రీ కళాశాల కార్యదర్శి ఒద్దుల సుబ్బారెడ్డి, డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళా ఖోఖో పోటీలను మంగళవారం కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఆటలతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. వర్సీటీ పరిధిలోని 9 కళాశాలల నుంచి ఖోఖో జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో వర్సీటీ టోర్నమెంట్ పరిశీలకుడు డాక్టర్ పి.శివప్రసాదు, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎ.అరుణసుజాత, జి.బాలశంకరరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ పి.వేణుగోపాల్, పీడీ ఎన్.కృష్ణంరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment