పంటల బీమా నమోదు గడువు 31
నరసరావుపేట: జిల్లాలోని రైతులు 2024–25 రబీ సీజన్ నుంచి వరి పంటకు ఎకరాకు రూ.620లు చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు కావాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంటల బీమా పథకంపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ(డీఎల్‌సీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట రుణం తీసుకున్న రైతులు నోటిఫై చేసిన వరిపంటకు ప్రీమియం చెల్లించేందుకు సమ్మతించని పక్షంలో ఈనెల 31కి వారం రోజుల ముందు సంబంధిత బ్యాంకుకు ధ్రువీకరణ పత్రం అందించాలని చెప్పారు. ప్రీమియం చెల్లించేవారు 31లోపు జమ చేయాలని సూచించారు. ఈ మేరకు రైతులకు గ్రామస్థాయిలో విస్తృతమైన అవగాహన సదస్సులు నిర్వహించాలని సభ్యులు, ప్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్‌లో ఇప్పటివరకు ఆరువేల హెక్టార్లలో వరి పంట సాగైందని, నిర్ణీత గడువులోగా ఈనెల 31లోగా రైతులను అప్రమత్తం చేసి నిర్ణీత ప్రీమియం చెల్లించి బీమా పథక ప్రయోజనం పొందేలా చూడాలని కోరారు. 2019 నుంచి 2023–24 వరకు జిల్లాలో మొక్కజొన్న 8,796 హెక్టార్లు, శనగపంట 12,908 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేశారన్నారు. గ్రామస్థాయిలో రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా మొక్కజొన్న, శనగ పంటలను రబీ సీజన్‌లో నోటిఫై చేసేందుకు గుంటూరు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌కు నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, ఎల్‌డీఎం శ్రీరామప్రసాదు, డీఈఎస్‌వో జి.శ్రీనివాస్, డీహెచ్‌వో సీహెచ్.రమణారెడ్డి, ఎన్‌ఎస్పీ ఏఇ ఎస్.మణిదీప్, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఎస్.బి.పంత్, సీఎస్‌సీ మేనేజర్ సైదావలి పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధి కోసం అవకాశాలను అన్వేషిద్దాం
స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అవకాశాలను శాఖల వారీగా అన్వేషించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం విజన్ 2047–పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక, పర్యాటకం, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలని సూచించారు. నాగార్జునసాగర్, కోటప్పకొండ, కొండవీడు కోట, అమరావతి వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం ప్యాకేజీలకు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో హోటల్ రంగం విస్తరణకు కృషి చేయాలన్నారు. వ్యవసాయం, పాల దిగుబడిపైనా సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో ఏ.మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, సీపీవో జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment