ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు

Published Wed, Dec 18 2024 2:03 AM | Last Updated on Wed, Dec 18 2024 2:03 AM

ఉపాధి

ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు

మాచర్ల రూరల్‌: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులందరూ సమష్టిగా పనిచేయాలని పల్నాడు జిల్లా ఏపీడీ కొరటా మల్లికార్జునరావు కోరారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కొప్పునూరు, తాళ్ళపల్లి, చింతలతండ, నాగులవరం గ్రామాలలో మినీ గోకులం షెడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డివిజన్‌లో మినీ గోకులం షెడ్ల నిర్మాణం కోసం తలపెట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకమైందని, ఈ పనుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీఓ శ్రీనివాసరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గోవిందు, ఇంజినీర్‌ గోపి, ఫీల్డ్‌ అసిస్టెంటు మరియదాసు, నాయకులు ఉన్నారు.

ఎట్టకేలకు రైతును కలిసిన ఉప ముఖ్యమంత్రి

మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను కలిసి అన్నదాతల సమస్యలు విన్నవించేందుకు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వచ్చిన రైతు నవీన్‌కుమార్‌కు ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్‌ దర్శనమిచ్చారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ‘సమస్యలు పరిష్కరించాలి ఎడ్ల బండి కట్టి’ అంటూ ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం నవీన్‌కుమార్‌ను కలిశారు. అనంతరం నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దళారుల బెడద తప్పించాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్‌లో విక్రయించుకునేలా చూడాలని కోరారు. వినతిపత్రాన్ని కార్యాలయంలో ఇవ్వాలని తెలపగా, ఆ మేరకు అందజేసినట్లు తెలిపారు.

ఎన్‌సీసీ కోటాలో అగ్రిసెట్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ఎన్‌సీసీ కోటాలో అగ్రిసెట్‌ 2024 ద్వారా ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు విఽశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీన కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను సంప్రదించాలన్నారు.

18 నుంచి లెవెల్‌ క్రాసింగ్‌ గేటు మూసివేత

లక్ష్మీపురం: మంగళగిరి నుంచి నిడమర్రు వరకు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో మూడు రోజుల పాటు నంబూరు–మంగళగిరి మధ్య లెవెల్‌ క్రాసింగ్‌ గేటును మూసి వేయనున్నట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు లెవెల్‌ క్రాసింగ్‌ గేటు మూసి వేయడం వల్ల ట్రాఫిక్‌ను డాన్‌ బాస్కో స్కూల్‌– నవలూరు సెంటర్‌ – క్రికెట్‌ స్టేడియం రోడ్డు –నిడమర్రు మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

వేటపాలెం: బాపట్ల జిల్లాలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో అగాఖాన్‌ రూరల్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌కు చెందిన 13 మంది సభ్యుల బృందం వేటపాలెం మండలానికి మంగళవారం వచ్చింది. వీరికి స్థానిక రైతుసేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయంలో నిర్వహిస్తున్న తొమ్మిది సూత్రాలు, తయారీ వాడకం గురించి వ్యవసాయ అధికారులు చేసి చూపి అవగాహన కల్పించారు. అనంతరం పందిళ్లపల్లిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా తొమ్మిది మంది రైతులు 13 ఎకరాల్లో సాగు చేస్తున్న దేశవాళీ వరి పంటలను సందర్శించారు. ఉపయోగాలు తెలుసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు 1
1/2

ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు

ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు 2
2/2

ఉపాధి పనులలో నిర్లక్ష్యం తగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement