తోబుట్టువే తోడేలై
నకరికల్లు: తోబుట్టువే తోడేలైంది. డబ్బుపై వ్యామోహంతో రక్తసంబంధాన్ని మరిచి సొంత సోదరులను పథకం ప్రకారం హత మార్చింది. మృతుల్లో ఒకరు కానిస్టేబుల్ కావడం, అతను విధులకు హాజరుకాకపోవడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. సొంత సోదరే అన్న, తమ్ముడిని చంపిందని తేల్చారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నకరికల్లులో కలకలం రేపిన ఈ కేసు వివరాలను డీఎస్పీ ఎం.హనుమంతరావు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నకరికల్లుకు చెందిన గిరిజన పాఠశాల ఉపాధ్యాయుడు తలపాల పౌలురాజు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. ఆయనకు ముగ్గురు సంతానం. గోపీకృష్ణ పెద్ద కొడుకు. రెండో సంతానం కృష్ణవేణి. దుర్గారామకృష్ణ చిన్నకొడుకు. కృష్ణవేణికి పెళ్లయి కూతురు ఉంది. భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటుంది. గోపీ కృష్ణ, దుర్గారామకృష్ణ కూడా భార్యలతో విడిపోయారు. ఈ క్రమంలో తండ్రి మరణంతో ప్రభుత్వం నుంచి వచ్చే రూ.70 లక్షలు తనకే చెందాలని కృష్ణవేణి డిమాండ్ చేసింది. దీనికి గోపీకృష్ణ, దుర్గారామకృష్ణ అంగీకరించలేదు. దీంతో ఘర్షణ పడుతూ వచ్చారు. అన్న, తమ్ముడి అడ్డు తొలగించుకుంటే డబ్బుతోపాటు తండ్రి వారసత్వంగా ఉద్యోగం వస్తుందని అత్యాశకు పోయిన కృష్ణవేణి సోదరుల హత్యకు పథకం రూపొందించింది.
వైరు తెగినా.. ఆగక..
తమ్ముడిని హత్య చేసిన 14 రోజుల అనంతరం ఈనెల 10న రాత్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్న గోపీకృష్ణ హత్యకు కృష్ణవేణి మరో ఇద్దరు మైనర్లతో కలిసి పథకం వేసింది. చెరో రూ.పదివేలు ఇస్తానని బేరం కుదుర్చుకుంది. అన్న గోపీకృష్ణకు కూడా మద్యం తాగించి మెడకు వైరు బిగించింది. వైరు తెగినా ఆగకుండా చున్నీ తో మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది. చనిపోయాడని నిర్ధారించుకున్నాక దానయ్య మోటార్‌సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి గుంటూరు బ్రాంచి కెనాల్‌లో మైనర్లు పడేశారు.
నేరాంగీకారం
హత్యలు చేసింది తానేనని నిందితురాలు ఒప్పుకోవడంతో ఆమెకు సహకరించిన నలుగురు మైనర్లతోపాటు కృష్ణవేణి, దానయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టుకు హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.
డబ్బు కోసమే సోదరుల హత్య దర్యాప్తులో తేల్చిన పోలీసులు ఆరుగురు నిందితుల అరెస్టు
సహజీవనం చేస్తున్న వ్యక్తి సహకారంతో..
రెండేళ్లుగా తనతో సహజీనం చేస్తున్న మల్లా దానయ్య సహకారంతో స్థానికంగా ఉండే ఇద్దరు మైనర్లతో కలిసి కృష్ణవేణి నవంబర్ 26న తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపేందుకు ప్రణాళిక వేసింది. మైనర్ యువకులకు చెరొక రూ.10వేలు ఇస్తానని బేరం కుదుర్చుకుంది. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో దుర్గారామకృష్ణకు మద్యం తాగించి చున్నీతో గొంతు బిగించి చంపారు. తర్వాత దానయ్య మోటారు సైకిల్‌పై దుర్గారామకృష్ణ మృతదేహాన్ని మైనర్లు తీసుకెళ్లి అక్షరస్కూల్ వద్ద గోరంట్ల కాలువలో పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment