వైభవంగా ఆరుద్రోత్సవం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలో ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో త్రికోటేశ్వర స్వామికి మహన్యాసపూర్వక మహారుద్రాభి షేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అభిషేకాలు నిర్వహించారు. చివరగా అన్నాభిషేకం జరిపిన అనంతరం స్వామికి విశేష పుష్పాలంకరణ చేశారు. తెల్లవారుజాము వరకు జరిగిన అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సౌలభ్యం కోసం త్రిముఖ శివలింగం వద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోటయ్య మాలధారులకు జ్యోతి దర్శనం కల్పించారు. పాతకోటయ్య స్వామి ఆలయం వద్ద వెలిగించిన జ్యోతిని భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి దర్శనంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆరుద్రోత్సవానికి హాజరైన భక్తులకు దాతల సహకారంతో అన్న సంత్పరణ చేశారు. మంగళవారం ఉదయం ఆలయ యాగశాలలో గణపతి హోమం, రుద్ర హోమం, శాంతి హోమం, వాస్తు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు.
త్రికోటేశ్వరునికి మహారుద్రాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment