పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Sun, Feb 2 2025 2:03 AM | Last Updated on Sun, Feb 2 2025 2:03 AM

పల్నా

పల్నాడు

ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

వరలక్ష్మి అమ్మవారి వ్రత పూజ

నగరం: మండలంలోని పెద్దవరం గౌడపాలెంలో ఉన్న శ్రీరామాలయంలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మార్కండేయ జయంతి

తాడేపల్లిరూరల్‌ : మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో ఉన్న భద్రావతి సమేత భావనాఋషిస్వామి ఆలయంలో శనివారం మార్కండేయ జయంతి నిర్వహించారు.

హనుమాన్‌ చాలీసా పారాయణం

గోళ్లపాడు(ముప్పాళ్ల): మండలంలోని గోళ్లపాడు గ్రామంలో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌చాలీసా పారాయణం శనివారం నిర్వహించారు.

సాక్షి, నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల పాత్ర కీలంగా ఉన్న నేపథ్యంలో బిహార్‌ తరహా ప్రాధాన్యం దక్కుతుందని అందరూ భావించారు. కానీ అదేమీ లేకపోవడంతో కూటమి పార్టీల తీరును ఎండగడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం ముఖ్యంగా ఆదాయపన్నుపై గత కొన్నేళ్లుగా వస్తున్న విమర్శలకు కొంత ఉపశమనం కలిగించేలా శనివారం బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతన జీవులకు కాస్త ఊరట లభించనుంది. ఈ కేటగిరీ కింద జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు 20 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. సీనియర్‌ సిటిజన్‌ కేటగిరీలో ఎటువంటి రాయితీలు ప్రకటించకపోవడం పట్ల ఆ వర్గం పన్ను చెల్లింపుదారులు పెదవి విరుస్తున్నారు.

అన్నదాతలకు ప్రయోజనం శూన్యం

కేంద్ర బడ్జెట్‌లో రైతులు పెద్దగా ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలేవి తీసుకోలేదు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణ పరిమితిని గతంలో ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కలిగిన 65,143 మంది అదనపు రుణం లభించనుంది. సాగునీటి రంగానికి సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపుల ప్రస్తావన లేదు. జాతీయ పత్తి మిషన్‌ ప్రకటించడంతో పత్తి రైతులకు కొంత మేలు జరిగే అవకాశముంది. జిల్లాలో పోయిన ఖరీఫ్‌లో 65,826 హెక్టార్లలో సాగు చేశారు. జాతీయ పత్తి మిషన్‌ రైతులకు అండగా నిలిస్తే గతంలో మాదిరి జిల్లాలో పత్తి సాగు లక్ష హెక్టార్లు చేరే అవకాశముంది. పత్తి ధరలు ఆశాజనకంగా లేకపోవడం, తెగుళ్లు అధికంగా ఉండటంతో రానురాను జిల్లాలో పత్తి సాగు తగ్గుతున్న విషయం తెలిసిందే.

కస్టమ్స్‌ సుంకాలు తగ్గింపు వల్ల ఆభరణాల ధరలు కొంత మేరకు తగ్గుతాయి. దీంతో వినియోగదారులకు చౌకగా లభిస్తాయి. ఆభరణాలు చౌకగా మారడంతో దేశీయ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది దేశీయంగా తయారయ్యే ఆభరణాల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుంది.

–మాడా మల్లికార్జునరావు,

బులియన్‌ వ్యాపారి, సత్తెనపల్లి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉన్నత వర్గాల మెప్పు పొందేందుకు పనిచేస్తున్నట్లుగానే ఉంది. సామాన్యులకు అవసరమైన విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదు.

–రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, చాగంటివారిపాలెం, ముప్పాళ్ళ మండలం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంది. బంగారం ధరల పెరుగుదలతో కేంద్ర బడ్జెట్‌కు సంబంధం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నిక కావడం వలన ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్‌ పెరిగింది. రూపాయి మారకం తగ్గడంతో పెట్టుబడులు పెడుతున్నారు.

– కపిలవాయి విజయకుమార్‌, బులియన్‌ మర్చంట్‌ రాష్ట్ర అధ్యక్షులు

కేంద్ర బడ్జెట్‌ వల్ల రైతులకు కలిగిన లాభం ఏమీ లేదు. ఎరువుల సబ్సిడీ పెంపు నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాట ధర లభించే విధంగా చర్యలేవీ తీసుకోలేదు. దేశవ్యాప్తంగా రైతులు, రైతుల సంఘాలు చేస్తున్న డిమాండ్‌లను పట్టించుకున్న పాపానపోలేదు.

– ఈవూరు గోపాలరావు,

రైతు సంఘం నేత, పల్నాడు జిల్లా

7

న్యూస్‌రీల్‌

తాగునీటికి ఇలా...

జలజీవన్‌ మిషన్‌ పథకం 2028 వరకు పొడిగింపు వల్ల జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం లభించనుంది. దేశంలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో 27.14 శాతం నమూనాల్లో లీటర్‌కు 1.5 మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరైడ్‌ కనిపించిందని జల్‌శక్తి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జల్‌జీవన్‌ మిషన్‌ పొడిగింపు ఉపయుక్తంగా ఉండనంంది. పల్నాడు జిల్లా అభివృద్ధికి కీలకమైన పరిశ్రమ, పర్యాటక రంగానికి ఉతమిచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయాలేవి తీసుకోలేదు. జిల్లాలో ఆయా రంగాల్లో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తే జిల్లా అభివృద్ధికి ఎంతో మేలు జరిగేది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మొత్తంగా కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

చౌకగా ఆభరణాలు

గిట్టుబాటు ధరలేవి?

సామాన్యులపై నిర్లక్ష్యం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై

పెదవి విరుస్తున్న ప్రజలు

వ్యవసాయ రంగానికి రిక్త

హస్తమేనంటున్న రైతులు, సంఘాలు

జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా

నిధులు మంజూరు కాని వైనం

పర్యాటకం, పరిశ్రమలకు మేలు

జరుగుతుందని ఆశించినా భంగపాటే

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/11

పల్నాడు

పల్నాడు2
2/11

పల్నాడు

పల్నాడు3
3/11

పల్నాడు

పల్నాడు4
4/11

పల్నాడు

పల్నాడు5
5/11

పల్నాడు

పల్నాడు6
6/11

పల్నాడు

పల్నాడు7
7/11

పల్నాడు

పల్నాడు8
8/11

పల్నాడు

పల్నాడు9
9/11

పల్నాడు

పల్నాడు10
10/11

పల్నాడు

పల్నాడు11
11/11

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement