మిచాంగ్ తుఫాన్ ప్రభావం రైతుల్లో కాస్త అలజడి సృష్టించినా... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రం నీరు సమృద్ధిగా చేరింది. భూ గర్భ జలాలు సైతం పెరిగాయి. నదుల్లో నీటి ప్రవాహం పెరగడం వల్ల నదీతీర గ్రామాల ప్రజలకు రానున్న వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు దూరంకానున్నాయి. రబీ పంటలకు సమృద్ధిగా నీరు అందడంతో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కూడా ప్రాజెక్టుల్లో నీరు ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో పశుపోషణకు నీటి సమస్యతలెత్తదని చెబుతున్నారు.
● తోటపల్లి కళకళ...
సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.35 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నారు. దీనిలో 81.5 వేల ఎకరాలకు గత ఖరీఫ్‌లో కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందింది. బొబ్బిలి, బలిజిపేట, సీతానగరం మండలాల్లో 1500 ఎకరాలకు ఈసారి అదనంగా నీరు అందించడం విశేషం. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 105 మీటర్లు. ప్రస్తుతం 104.12 మీటర్ల మేర నీటినిల్వ ఉంది.
● మడ్డువలసకు నీటితాకిడి
వంగర మండలంలోనున్న మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుతం 64.20 మీటర్లు మేర నీటినిల్వ సామర్థ్యం ఉంది. దీని పూర్తినీటి నిల్వ సామర్థ్యం 65 మీటర్లకు చేరడానికి సమీపంలో ఉంది. సువర్ణముఖి, వేగవతి నదుల నుంచి ప్రస్తుతం 444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. దీని కుడి ప్రధాన కాలువ ద్వారా 31 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
నిండుగా
వెంగళరాయసాగర్
మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న వెంగళరాయసాగర్‌లో ప్రస్తుతం నీరు నిండుగా ఉంది. దీని పూర్తినీటి నిల్వ సామర్థ్యం 161 మీటర్లు. ప్రస్తుతం 158.43 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 193 క్యూసెక్కుల వరకూ ఉంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
‘నేను నమ్ముకున్నది దేవుణ్ని, ప్రజలను మాత్రమే’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి బహిరంగ సభలో చెబుతుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరుగులేని మెజార్టీతో గెలిపించి అధికార పీఠంపై కూర్చోబెట్టారు. అలాగే, వానదేవుడు కూడా కరుణించారు. గత ఐదేళ్లలో కరువును జిల్లాలో అడుగుపెట్టనివ్వలేదు. గత టీడీపీ పాలనలో ఎండిపోయిన రిజర్వాయర్లన్నీ నాలుగేళ్లుగా కళకళలాడుతున్నాయి. ప్రస్తుత నీటిమట్టాలను చూస్తే ఐదో ఏటా పంటలకు ఢోకా లేదని రైతులు ధీమాగా ఉన్నారు. మిచాంగ్ తుపాను ప్రభావం వల్ల పడిన వర్షాలతో కొంతమేర పంటలకు నష్టం జరిగినా రిజర్వాయర్లలో మాత్రం నీటిమట్టం బాగా పెరిగింది. భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నాయి.
● నిండుగా తాటిపూడి...
గంట్యాడ మండలం తాటిపూడి గ్రామ సమీపంలోనున్న తాటిపూడి గొర్రిపాటి బుచ్చిఅప్పారావు జలాశయం నిండుగా ఉంది. 15,367 ఎకరాల ఆయకట్టు ఉంది. గంట్యాడ, శృంగవరపుకోట, జామి మండలాల్లో ఉన్న రైతులకు ఈ జలాశయమే ప్రధాన ఆధారం. దీని నీటినిల్వ సామర్థ్యం 297 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో 292 అడుగులు ఉంది. ఇంకా పైనుంచి 110 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో కుడి ప్రధాన కాలువ ద్వారా 20.48 క్యూసెక్కుల నీటిని పొలాలకు విడుదల చేస్తున్నారు.
వైఎస్సార్ వరం జంఝావతి
వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో సాకారమైన జంఝావతి ఎత్తిపోతల పథకం ఇది. ప్రస్తుతం 8,2000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది. ఇటీవల వర్షాలతో నీటినిల్వ పెరిగింది.
కాస్త తగ్గిన ఆండ్ర...
దాదాపు 91,450 ఎకరాల ఆయకట్టుకు కీలకమైన ఆండ్ర జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 140.50 మీటర్ల మేర ఉంది. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 146 మీటర్లు. గత ఏడాది ఇదే సమయానికి 144.60 మీటర్ల మేర నీరు నిల్వ ఉండేది.
వరుసగా ఐదో ఏటా జలాశయాలన్నీ
నిండుగా!
పెరిగిన భూగర్భ జలాలు
రబీలో సాగునీటి కష్టాలు దూరం
రానున్న ఖరీఫ్‌లో పంటల సాగుకు అనుకూలం
Comments
Please login to add a commentAdd a comment