పేదలకు ఆరోగ్యశ్రీ దూరం..!
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్య భరోసా కరువైంది. ఆరోగ్యశ్రీ సేవలు దూరమవుతున్నాయి.
వైద్యకళాశాల నిర్మితమయ్యేనా?
ప్రతి పేదవానికీ మెరుగైన వైద్యం కోసం వైద్యసేవలన వారి ముంగిటకే తీసుకొచ్చింది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఇక్కడి ప్రజల వైద్య అవసరాలకు అనుగుణంగా పార్వతీపురంలోని ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెంచింది. గతంలో వంద పడకలున్న ఆస్పత్రిని 150 పడకలుగా మార్పు చేసింది. అధునాతన వైద్య సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేశారు. పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. మొదట్లో ఆస్పత్రి పనులు శరవేగంగా జరిగినా.. ప్రస్తుతం మందగించాయి. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. అందుకనుగుణంగానే మన్యం జిల్లాకు రూ.600 కోట్లతో కళాశాల నిర్మాణానికి సంకల్పించింది. తర్వాత ప్రభుత్వం మారడంతో.. ఇప్పుడు వైద్య కళాశాల సందిగ్ధంలో పడింది. సాలూరు ప్రజల చిరకాల కల అయిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో జోరుగా సాగింది. ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి.
నత్తనడకన సాగుతున్న సాలూరులోని వందపడకల ఆస్పత్రి నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment