ఇంజినీరింగ్ విద్య అందేనా?
గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలోని చిట్టచివరి నియోజవర్గమైన కురుపాం ప్రాంతంలోని విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చేదన్నది ఈ ప్రాంత ప్రజల మాట. గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న అప్పటి డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రూ.153.85 కోట్లు మంజూరు చేశారు. కురుపాం నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలోని టేకరికండిలో 106 ఎకరాల స్థలంలో ఇంజినీరింగ్ భవనాల నిర్మాణ పనులకు 2020 అక్టోబర్ 2న వర్చువల్ విధానంలో జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 70 శాతం పనులు పూర్తిచేశారు. మరి కొద్ది రోజుల్లో పనులు పూర్తయి గిరిజనులకు గిరిజన ఇంజినీరింగ్ చదువులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణ పనులపై దృష్టిసారించి ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తేవాలని గిరిజన విద్యార్థిలోకం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment