టెండర్ వాయిదా
పార్వతీపురం: గిరిజన సహకారసంస్థ కిరాణా టెండర్‌కు సంబంఽధించి ఈనెల 4న నిర్వహించాల్సిన టెండర్ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జీసీసీ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి టెండర్‌ను ఎప్పుడు నిర్వహించేది జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటన ద్వారా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. టెండర్‌లో పాల్గొనే వారు దీన్ని గమనించాలని కోరారు.
గర్భిణులకు పౌష్టికాహారం
అందజేయాలి
పార్వతీపురం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందజేసేందుకు పౌష్టికాహార కిట్లను సిద్ధంచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గర్భిణుల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని, దీనిని అధిగమించేందుకు డ్రై ఫ్రూట్స్, పండ్లను అందజేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయపార్వతి, నోడల్ అధికారి ఎం.వినోద్‌కుమార్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, ఐసీడీఎస్ పథక సంచాలకులు టి.కనకదుర్గ, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డీపీఓ టి.కొండలరావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ విద్యార్థికి
కిక్ బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్
కొమరాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్న తెంటు హేమంత్ కిక్ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన హౌరాలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బిక్సింగ్ 48 కిలోల విభాగంలో దేశం తరఫున తలపడి విజేతలగా నిలిచినట్టు పిన్సిపాల్ నాగేశ్వరరా వు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కళాశాల ఆవరణలో హేమంత్ ను గురువారం సత్కరించారు. క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిత ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు ఉండాలి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: ఈనెల 27,28,29 తేదీలలో నిర్వహించే శంబర జాతరకు పక్కాగా ఏర్పా ట్లు ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శంబర పోలమాంబ జాతరను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం క్యూలను పటిష్టంగా ఏర్పాటుచేయాలన్నారు. వైద్యశిబిరాలను, భక్తులు బట్టలు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment