జాగ్రత్తలు ఇలా...
●శీతాకాలంలో చర్మం పొడి బారుతుంది. మాయిశ్చరైజర్లు తప్పనిసరిగా వినియోగించాలి.
●చలికాలంలో చాలామంది నీరు తాగడం తగ్గిస్తారు. అలా చేయకూడదు. తగిన మోతాదులో మంచినీళ్లు తాగాలి.
●ఐస్ క్రీమ్, చల్లని నీరు, పదార్థాలకు
దూరంగా ఉండాలి.
●వేడి ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం, మాంసాహారం బాగా తగ్గించాలి.
●గోంగూర, వంకాయ, కొబ్బరి కూరలను తినడం తగ్గించాలి.
●ఎండు చేపలు తినడం మానేయాలి.
●దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. చలిగాలుల్లో తిరగకుండా ఉండడం మంచిది.
●ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి. న్యూమోనియా వ్యాక్సిన్ ఐదేళ్లకు ఒకసారి వైద్యుల సూచనలతో వేసుకుంటే మంచిది.
●ఇండోర్ వ్యాయామం, జిమ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
●వృద్ధులు, పిల్లలు చలిలో తిరగకుండా
చూడాలి.
●రాత్రిళ్లు చలిలో ప్రయాణాలు చేయరాదు. అత్యవసరం అయితే వేడిని శరీరానికి అందించే ఉన్ని దుస్తులు ధరించాలి.
●ఇంటిలో ఎవరికై నా జలుబు, దగ్గు వస్తే వైద్యు ల సూచనలతో మందులు వాడాలి. సొంత వై ద్యం సరికాదు. కుటుంబంలో ఒకరికి వాడే ఔషధాలు వేరొకరికి వినియోగించడం సరికాదు.
●శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment