విద్యార్థులు విద్యావంతులు కావాలి
సీతానగరం: జిల్లాలో ప్రభుత్వ విద్య ప్రతికుటుంబం సొత్తుకావాలని, ఉన్నతస్థాయిలో విద్యావంతులు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. పల్లెనిద్రలో భాగంగా గురువారం రాత్రి జోగింపేట స్కూల్ ఆఫ్‌ఎక్స్‌లెన్స్‌లో ఉపాధ్యాయులు నిర్వహించే తరగతులు, విద్యాబోధన, నిర్వహిస్తున్న అదన పు తరగతుల్లో విద్యార్థులు ఏవిధంగా వినయోగించుకుంటున్నారన్న అంశంపై కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్య మైన విద్య, నాణ్యమైన వసతులు కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలియజేశారు. స్కూల్‌ఆఫ్‌ఎక్స్‌లెన్స్‌లో విద్యార్థులందరూ విద్యాపరంగా నిష్ణాతులైన విద్యావంతులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ త్రివిక్రమరావు, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంఈఓలు జి.సూరిదేముడు, ఎం.వెంకటరమణ, ప్రిన్సిపాల్ ధర్మరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో..
మండలంలో జరుగుతున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కరుణాకర్ జోగింపేట డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువు అధికారులు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment