ఈయూ జోనల్ కార్యదర్శి బి.కృష్ణమూర్తి
ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విజయనగరం ఆర్టీసీ డిపో ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆర్టీసీ సర్కులర్ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేయడాన్ని ఈయూ నాయకులు తప్పుబట్టారు.
అధికారుల ఏకపక్ష నిర్ణయాలను విడనాడాలంటూ నినదించారు. ఉద్యోగలు సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని ఈయూ జోనల్ కార్యదర్శి బి.కృష్ణమూర్తి హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి జి.రవికాంత్, జోనల్ కార్యదర్శి కె.వి.రమణ, డిపో కార్యదర్శి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం అర్బన్
Comments
Please login to add a commentAdd a comment