పసుపురంగుతో కిత్తన్నపేట గ్రామంలోని పంచాయతీ భవనం
చిత్రంలో పసుపురంగుతో కనిపిస్తున్నది ఎల్.కోట మండలం కిత్తన్నపేట గ్రామంలోని పంచాయతీ భవనం. దీనిలో ప్రస్తుతం రైతు సేవా కేంద్రం నిర్వహిస్తున్నారు. పదిరోజుల కిందటి వరకు తెలుపు రంగు గోడలతో కనిపించే భవనం ఉన్నట్టుండి పసురంగులోకి మారడంతో గ్రామస్తులు అవాక్కవుతున్నారు.
ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టిన కూటమి నేతలు భవనాలకు పసుపు రంగు పులుపుకోవడంలో నిమగ్నమయ్యారని విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై పంచాయతీ కార్యదర్శి శైలజ మాట్లాడుతూ ఆదివారం సెలవు దినాన గ్రామ సర్పంచ్ భవనానికి రంగులు వేయించారని తెలిపారు. రంగుల బిల్లులను పంచాయతీ ఖాతాలో నమోదు చేయాలని సూచించారని, విషయం ఉన్నతాధికారులతో చర్చించి నమోదుచేస్తానని బదులిచ్చినట్టు వెల్లడించారు. – లక్కవరపుకోట
Comments
Please login to add a commentAdd a comment