సీతంపేట ఐటీడీఏలోని అడవితల్లి విగ్రహం వద్ద మంగళవారం భిక్షాటన
విద్యను దానం చేసే గురువులు... నేడు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామంటూ సీతంపేట ఐటీడీఏలోని అడవితల్లి విగ్రహం వద్ద మంగళవారం భిక్షాటన చేశారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు 2022 పీఆర్‌సీ ప్రకారం జీతాలు చెల్లించాలని, పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలని కోరారు.
నెలరోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు బి.గణేష్, ఎస్.మోహన్‌రావు, కె.భవాని, బి.ధర్మారావు, రాజేశ్వరి, శివరాం, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
– సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment