బోట్స్ ఎస్‌ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎడ్వర్డ్‌జీ ఒప్పందంపై సంతకాలు
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యావిభాగం ఆధ్వర్యంలో బోట్స్ ఎస్‌ఆర్ సంస్థతో జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) మంగళవారం పరిశ్రమ అకాడెమియా అనుబంధాన్ని బలోపేతం చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, బోట్స్ ఎస్‌ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్ ఎడ్వర్డ్‌జీ ఒప్పందంపై సంతకాలు చేశారు.
కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ఆడిట్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, ఇంటర్న్ షిప్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.పద్మజ, డాక్టర్ ఎం.హేమ, డాక్టర్ టీఎస్‌ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం అర్బన్
Comments
Please login to add a commentAdd a comment