కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్డికి సంబంధించి సెఫ్టిక్ ట్యాంక్ కోసం తీసిన గొయ్యిలో ఓ బాలుడు తూరిబిల్లి దుశ్వంత్(2.6) ప్రమాదవశాత్తు పడి శుక్రవారం మృతి చెందాడు. అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో పెళ్లివేడుక జరుగుతుండగా బాలుడు ఆటుకుంటూ వెళ్లి గోతిలో పడిపోయాడు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి గొయ్యి పూర్తిగా నీటితో నిండిపోయింది, బాలుడు ఎంతకీ కనిపించకపోవడంతో వెతకగా చివరికి గొయ్యిలో విగత జీవిగా కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment