సీతంపేటలో నీతి అయోగ్ బృందం
సీతంపేట: స్థానిక అడ్వెంచర్ పార్కును నీతి అయోగ్ బృందం శుక్రవారం సందర్శించింది. పార్కులో ఏర్పాటు చేసిన వివిధ సాహసక్రీడల్లో పాల్గొన్నారు. ఫైవ్ డీ థియేటర్‌లో మూవీని చూశారు.కార్యక్రమంలో నీతిఅయోగ్ డిప్యూటీ సెక్రటరీ అరవింద్‌కుమార్, యంగ్‌ఫ్రొఫెషనల్ ఇంద్రజిత్‌కుమార్, ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
నీతి అయోగ్ లక్ష్యాలను చేరాలి
భామిని: మండలంలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నీతి అయోగ్ బృందం శుక్రవారం పర్యటించింది.నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ అరవింద్ కుమార్, యంగ్ ప్రొఫెషనల్ ఇంద్రజిత్ కుమార్, ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, మధుసూధన్ బృందం మండలంలోని పాలస్‌కోట, నల్లరాయిగూడ.సన్నాయిగూడ,భామినిలలో పర్యటించారు.నీతి అయోగ్‌లో ఆస్పిరేషన్ బ్లాక్ కింద భామిని మండలం ఎంపిక కావడంతో మండలంలో పీఎం జన్‌మాన్ కార్యక్రమాలపై సమీక్షించారు.నల్లరాయిగూడలో వన్‌ధన్ వికాస్ కేంద్రాన్ని పరిశీలించి సభ్యులతో మాట్లాడారు.ఆదివాసీల తాగునీటి సమస్య,పక్కా గృహాల నిర్మాణాలు, విద్యుత్తు, వైద్య సౌకర్యంపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment