పొలాల్లో నీరు.. రైతుకంట కన్నీరు
ఎకరాల మేర తడచి నష్టం చేకూరిందని రైతులు చెబుతున్నారు.
● సాలూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు గోనె సంచులు, వాహనాలు అందించడంలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొత్తవలస ప్రాంతంలో రైతులు తమ వరిచేలు కోయలేదు. వాతావరణం అనుకూలిస్తే కోసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. కోతకు కాలం పూర్తిగా దాటిపోవడంతో ధాన్యం రాలిపోయే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. మెంటాడ మండలంలో వర్ష ప్రభావంతో ఎక్కడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. జక్కువ గ్రామంలో పొలంలో వేసిన వరి దిబ్బలు నీట మునిగాయి.
● పాలకొండ నియోజకవర్గంలో రైతన్న కంట కన్నీరే మిగిలింది. ఖరీఫ్ సేద్యానికి సంబంధించి చివరిదశలో వరుస తుపాన్ల కారణంగా చేతికందిన పంట తడిచిముద్దవుతోంది. వీరఘట్టం మండలంలో 15వేల ఎకరాలకు పైగా వరిసాగు చేయగా
సాక్షి, పార్వతీపురం మన్యం: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. శనివారం కాస్త తెరిపి ఇచ్చినట్లయ్యింది. అక్కడక్కడ చిన్న జల్లులు మినహా.. వర్ష ప్రభావం కనిపించలేదు. ఇదే సమయంలో గురువారం సాయంత్రం నుంచి కురిసిన వర్షంతో వరి పంట చేలలో నీరు చేరింది. కొంతమంది రైతులు కోతలు పూర్తి చేసిన ధాన్యాన్ని పొలాల్లోనే కుప్పలు వేయగా.. నూర్చిన ధాన్యాన్ని తరలించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిల్లాలో ఈ ఏడాది 1,75,474 ఎకరాల్లో వరి సాగవ్వగా.. ఇప్పటికే 1.70 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 85 వేల ఎకరాలకుపైగా నూర్పులు పూర్తయ్యాయి. రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు అధికారులు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేశారు. మిగిలిన పంట రైతుల వద్దనే ఇంకా ఉంది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సీతానగరం, బలిజిపేట, పాలకొండ, భామిని, సాలూరు పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో ఇంకా నూర్పులు పూర్తి కాలేదు. కళ్లాల్లో కుప్పలు వేసి, వరి దిబ్బలపైన.. నూర్చిన ధాన్యం బస్తాలపైన టార్పాలిన్లు వేసి రైతులు కాపాడుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధమవుతున్న సమయంలో వర్షం కురవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రంగు మారితే, తేమ శాతం సాకుగా చూపి మద్దతు ధరకు కోత వేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు ధాన్యం దోపిడీకి తెర తీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అపరాలకూ తప్పని నష్టం..
అపరాలు, పత్తి పంటకు కూడా వర్షం వల్ల నష్టం ఏర్పడుతోంది. పత్తి తడిచి ముద్దవుతోంది. రబీలో దాదాపు 63,780 ఎకరాల్లో వివిధ రకాల వాణిజ్య పంటలు వేసేందుకు రైతులు సమాయత్తమయ్యారు. మినప, పెసర వంటి పంటలు కొన్నిచోట్ల పూత దశకు చేరుకుంది. మరికొన్ని గ్రామాల్లో మొక్క స్థితిలో ఉంది. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
● వర్షాల కారణంగా పార్వతీపురం మండలంలో 1,180 ఎకరాలు, సీతానగరం మండలం 1080, బలిజిపేట మండలంలో 1,200 ఎకరాల వరకు అపరాల సాగుకు నష్టం చేకూరినట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కుప్పలు వేసిన వరి మాత్రం పార్వతీపురం మండలంలో 168 ఎకరాలు, సీతానగరం మండలం 170, బలిజిపేట మండలం 150
అన్నదాతలకు వాయు‘గండం’
చి‘వరి’లో కష్టం
పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు
Comments
Please login to add a commentAdd a comment