సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

Published Mon, Dec 30 2024 1:38 AM | Last Updated on Mon, Dec 30 2024 1:38 AM

సోమవా

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

నేడు శంబర చేరుకోనున్న పెదపోలమాంబ

మక్కువ : ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత శంబర పోలమాంబ మేనత్త పెద పోలమాంబ అమ్మవారు సోమవారం శంబర గ్రామానికి చేరుకోనుంది. సోమవారం నుంచి శంబర గ్రామంలో పోలమాంబ అమ్మవారి జాతర శోభ సంతరించుకోనుంది. పెద్దమ్మవారిని గ్రామానికి తీసుకొచ్చేందుకు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పెద్దమ్మవారిని సోమవారం గ్రామంలోని పెద్దమ్మ వారి గద్దెకు తీసుకొని వస్తారు. మంగళవారం అమ్మవారు విశ్రాంతి తీసుకుని బుధవారం నుంచి గ్రామంలోని భక్తులకు అమ్మవారి దర్శనమిస్తారు. వచ్చే జనవరి 6న తొలేళ్ల ఉత్సవం, 7న పెద్దమ్మ వారి పండగ, 8న అనుపోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు శంబర పోలమాంబ అమ్మవారిని కొని తెచ్చేందుకు చాటింపు వేస్తారు. వచ్చే ఏడాది జనవరి 27, 28, 29 తేదీలలో పోలమాంబ అమ్మవారు జాతర నిర్వహిస్తారు.

‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ పుస్తకావిష్కరణ

విజయనగరం టౌన్‌: స్థానిక గురజాడ స్వగృహంలో ఆదివారం సాయంత్రం పాయల మురళీకృష్ణ కవితా సంపుటి ‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి చీకటి దివాకర్‌ అధ్యక్షత వహించారు. ప్రముఖ వయోలినిస్ట్‌ ద్వారం దుర్గాప్రసాదరావు పుస్తకావిష్కరణ చేశారు. మానస చామర్తి, సుంకరి గోపాలయ్యలు కవితా సంపుటిని పరిచయం చేశారు. రచయిత తనదైన శైలిలో కవితా సంపుటిని రచించారన్నారు. ఆత్మీయ అతిథులుగా అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, గార రంగనాథం, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యాలనాయుడు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీవేత్తలు పాల్గొన్నారు.

రాజాం కుర్రోడి వెబ్‌ సిరీస్‌కు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు

రాజాం: పట్టణంలోని తెలగవీధికి చెందిన యూట్యూబర్‌ డాలియేల్‌ ప్రకాష్‌ డైరెక్ట్‌ చేసి నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును అందుకుంది. విశాఖపట్నంలో డాబా గార్డెన్‌ వద్ద అల్లూరి సీతారామరాజు జ్ఞానవేదికలో ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివెల్‌ మేకర్స్‌ అసోషియేషన్‌ ఇంటర్నేషనల్‌ విశాఖ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆదివారం నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌లో నామినేటైడెన ప్రకాష్‌ వెబ్‌ సిరీస్‌కు బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ అవార్డును సినీ నటులు, ఫిల్మ్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సత్యానంద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రంలో మత్తు మందుకు బానిసవుతున్న విద్యార్థుల జీవితాలు, తల్లిదండ్రుల బాధ్యతపై ప్రకాష్‌ తొమ్మిది నెలలు పాటు శ్రమించి ఇన్విస్టిగేషన్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. తానే డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్‌లో రాజాం, విశాఖ ప్రాంతాలకు చెందిన నటులు పాల్గొన్నారు. పాలకొండ, సోంపేట, రాజాం, విశాఖపట్నం ప్రాంతాల్లో 2023లో సిరీస్‌ షూటింగ్‌ జరిగింది. 2024లో యూట్యూబ్‌లో ఈ సిరీస్‌ రిలీజ్‌ చేయగా లక్షల్లో సబ్‌స్క్రైబర్లును సొంతం చేసుకొంది. రాజాం జీసీఎస్‌ఆర్‌లో డిగ్రీ పూర్తి చేసిన ప్రకాష్‌ ఓ ప్రైవేట్‌ మార్కెటింగ్‌ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో వైపు వెబ్‌ సిరీస్‌లు నిర్మించి, డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగా సామాజిక స్పృహతో తీసిని ఇన్విస్టిగేషన్‌ వెబ్‌ సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంది. సత్యానంద్‌ చేతుల మీదుగా బెస్ట్‌ సిరీస్‌ అవార్డును అందుకున్న ప్రకాష్‌ తన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందని, టీం మొత్తానిది ఈ విజయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ని తల్లి మంగమ్మ, భార్య శ్రావణలక్ష్మితో పాటు కుటుంబీకులు, స్నేహితులు అభినందించారు.

జీసీసీ కొనుగోలు చేయాలి

జీసీసీ మాత్రమే కొండచీపుర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధగా కొనుగోలు చేయకూడదు. అనుమతులు లేకుండా కొండచీపుర్లు రవాణ చేస్తే పట్టుకుని ఫైన్లు విధిస్తున్న మాట వాస్తవమే. ఈ విషయమై ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో కూడా గిరిజనులు ఫిర్యాదు చేశారు. తమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం.

– రామారావు, ఎఫ్‌ఆర్‌ఓ పాలకొండ

ఎప్పుడూ ఇలా లేదు..

ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. రెవెన్యూ భూముల్లోనే కొండచీపుర్లు పండిస్తున్నాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో పండించడం లేదు. అటవీ శాఖ ఎవరినీ కొనుగోలు చేయకనీయపోతే ఎలా? కొనుగోలు చేసే వారిని పట్టుకుంటే ఎవరు ముందుకు వస్తారు. ఇళ్లల్లోనే కొండచీపుర్లు మగ్గుతున్నాయి. కనీసం ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

– ఎస్‌.సాయికుమార్‌, మాజీ సర్పంచ్‌, మండ

కష్టానికి తగ్గ ఫలితం లేదు

కష్టానికి తగ్గ ఫలితం లేదు. కొండలపైకి వెళ్లి సేకరించి ఇంటిళ్లపాది మోసుకుతెచ్చుకుని రోజుల తరబడి కొండచీపుర్లు తయారు చేస్తాం. చేసిన తర్వాత మార్కెట్‌కు తరలించినా అక్కడ ఎటువంటి ధరలు లేకపోవడంతో ఇళ్లకు తిరిగి తీసుకు వచ్చేస్తున్నాం.

– ఎ.ఆనంద్‌, దిగువకలువరాయి

సీతంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన అటవీ ఉత్పత్తుల విక్రయాల్లో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాము పండించి సేకరించిన అటవీ ఫలసాయాలు అమ్ముకోవాలంటే ప్రభుత్వ సంస్థలే అడ్డుపడితే తాము ఎవరికి చెప్పుకోవాలని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గిరిజనులు ఈ సీజన్‌లో విస్త్రతంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చే కొండచీపుర్లును అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న వనధన్‌ వికాస్‌ కేంద్రాల్లో తయారైన కొండచీపుర్లును ఇటీవల బయట ప్రాంతాలకు విక్రయాలకు వెలుగు ఆధ్వర్యంలో తీసుకువెళ్తున్న వ్యాన్‌ను పట్టుకుని అటవీ శాఖ దాదాపు రూ.లక్ష వరకు ఫైన్‌ విధించినట్టు సమాచారం.

ఇదీ పరిస్థితి

సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 1500ల హెక్టార్లలో కొండచీపుర్లు పంట పండుతుంది. కొండపోడు వ్యవసాయంలో భాగంగా ఈ పంటను పండిస్తారు. పంట పక్వానికి వచ్చిన తర్వాత వాటిని సేకరించి తీసుకువస్తారు. అనంతరం ఇంటిళ్లపాది కొండచీపుర్లు గ్రేడింగ్‌ చేసి తయారు చేస్తారు. వీటిని వారపు సంతలకు తెచ్చి సరాసరి రూ.30 వరకు మాత్రమే ధర పలుకుతుందని గిరిజనులు తెలిపారు. గతంలో రూ.55 వరకు ధర పలికేది. ఇప్పుడు మాత్రం వ్యాపారులు కొనుగోలు చేయడం తగ్గడంతో కొండచీపుర్లుకు మద్దతు ధరలు లేవని గిరిజనులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఒడిశా మార్కెట్లో ఒక్కో చీపురు రూ.70 వరకు ధర పలుకుతుందని గిరిజనులు తెలిపారు. ఇటీవల ఐటీడీఏలో జేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో సైతం తాము సేకరిస్తున్న కొండచీపుర్లుకు మద్దతు ధరలు లేవని, అటవీ శాఖ ఫైన్‌లు వేస్తుండడంతో ఎవరూ కొనుగోలుకు ముందుకు రావడం లేదని వినతులు సమర్పించామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని గిరిజనులు తెలియజేస్తున్నారు.

నేడు మండల స్థాయి సైన్స్‌ పోటీల నిర్వహణ

వచ్చే నెల 3న జిల్లా స్థాయి పోటీలకు ఏర్పాట్లు

జిల్లాలో 11 కమిటీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ

నాదిగా గిరిజనులు ఆచరించే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కందికొత్తల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం హెచ్‌ గ్రౌండ్‌ వద్ద ఆదివారం కంది కొత్తల ఉత్సవాలు జరిగాయి. ఇందులో గిరిజనులు వారి సంప్రదాయ వాయిద్య పరికరాలు, దేవతామూర్తులుగా కొలిచే గొడ్డలమ్మ, చతురమ్మలతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి సంప్రదాయ రీతిన పూజలు నిర్వహించి డప్పువాయిద్యాలు వాయిస్తూ థింసా నృత్యాలు చేసారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యంలో అడుగులు వేసారు. డప్పు చేతపట్టి వాయించారు. గిరిజనుల ఈ పండగ వారి ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. గుమ్మలక్ష్మీపురం

న్యూస్‌రీల్‌

నామమాత్రంగా జీసీసీ కొనుగోలు

గిరిజన సహకార సంస్థ మద్దతు ధరలు ప్రకటించినా నామమాత్రంగానే కొనుగోలు చేస్తుండడంతో ఈ పరిస్థితి దాపురించిందని రైతులు చెబుతున్నారు. దీంతో గిరిజనులు బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. అటవీ శాఖ కొండ చీపుర్లు రవాణా చేస్తున్న వారిని పట్టుకుని భారీగా అపరాధ రుసుం విధిస్తుండడంతో కొంతమంది వ్యాపారులు సైతం కొండచీపుర్లు కొనుగోలుకు ముందుకు రాని పరిస్థితి ఉందని గిరిజన రైతులు వాపోతున్నారు. ప్రతీ వారంలో ఒకరోజు సీతంపేట, మర్రిపాడు, పూతికవలస, పొల్ల, దోనుబాయి, కుశిమిలలో జరిగే వారపు సంతలకు గిరిజనులు అమ్మకానికి మోసుకు తీసుకువచ్చే కొండచీపుర్లు చెల్లుబాటు కాక ఊసూరుమంటూ ఇళ్లకు తీసుకువెళ్లే పరిస్థితి ఉంది. ఇవి ఇళ్ల వద్ద మగ్గుతున్నాయి. జీసీసీ సైతం ఇటీవల కొండచీపుర్లు కొనుగోలుకు మద్దతు ధరలు ప్రకటించింది. 1వ రకం కొండచీపుర్లు రూ.45, రెండవ రకం రూ.40, మూడో రకం రూ.30 కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఆ స్థాయిలో కొనుగోలు మాత్రం చేయడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

కొండచీపుర్లు కొన్నవారికి అటవీ శాఖ అపరాధ రుసుం

వీడీవీకేలను సైతం వదలని సిబ్బంది

నామమాత్రంగా జీసీసీ కొనుగోలు

ఫైన్‌ల భయంతో ముందుకు రాని వ్యాపారులు

అమ్మకానికి గిరిజనుల అగచాట్లు

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20241
1/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20242
2/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20243
3/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20244
4/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20245
5/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20246
6/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20247
7/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20248
8/8

సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement