సంక్షేమం..
● ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి నాయకులు ● ఎన్నికల సంవత్సరం ముగిసినా పథకాలు ఊసెత్తని వైనం ● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలిమూడు నెలల పాలనలో సంక్షేమ పథం ● నేడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి పేదల పథకాలకు చెల్లు!
నాడు
పార్వతీపురంటౌన్:
పార్వతీపు రం మన్యం జిల్లా.. అభివృద్ధి కేంద్రీకరణే లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన జిల్లాల విభజన ప్రక్రియ ఫలితంగా 2020 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పడింది. అప్పటి నుంచి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందజేసేవా రు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకువెళ్లేవారు.అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తు న్న పార్వతీపురం మన్యం జిల్లాలో 2024 సంవత్సరం మార్చి నెల నుంచి సంక్షేమం, అభివృద్ధికి బ్రేక్‌లు పడ్డాయి. ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి.
గత వైఎస్సార్‌సీపీ పాలనలో...
2024 జనవరి నెలలో...
●1వ తేదీ.. వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద అప్పటివరకు 1,43,800మందికి పింఛన్లు అందజేస్తే.. జనవరి 1న కొత్తగా 1698 మందికి పింఛన్లు మంజూరుచేసి ఆ సంఖ్యను 1,45,498కు చేర్చింది.
●5న... వివిధ కారణాలతో ప్రభుత్వ పథకాలు అందని వారికి నవరత్న వికాసం పథకం కింద జిల్లాలో 777 మందికి రూ.1.16కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.
●6న.. జిల్లాలో 37 పీహెచ్‌సీలకు ఇద్దరు చొప్పున వైద్యులను నియమిస్తూ గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు విస్తృతం చేశారు.
●11న.. చిన్న, చిరు వ్యాపారాలు చేసిన వారికి ఆర్థిక భరోసాను ఇస్తూ ఆసరా పథకం ద్వారా జిల్లా లో 7,460 మంది చిరు వ్యాపారులకు 7.59 కోట్ల నగదును నేరుగా వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
●18న.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో జిల్లాలో 7,660 మంది లబ్ధిదారులకు రూ. 81.03 కోట్లను లబ్ధిదారులు ఖాతాల్లో జమచేశారు.
●20న.. మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో 1622 హెక్టార్లలో సాగు చేస్తున్న చిరుధాన్యాల పంటలకు భరోసాను కల్పిస్తూ వీడీవీకెల ద్వారా ప్రాససింగ్ యూనిట్లను ప్రారంభించి గిరి రైతులకు భరోసా కల్పించారు.
●23న... డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకం కింద 1,83,077 మందికి రూ.94.33కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు.
●25న.. గిరిజన గ్రామాల్లో సచివాలయ సేవలకు, పేదలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించేందుకు గిరిశిఖర గ్రామాల్లో 196 మొబైల్ టవర్లను రూ. 200 కోట్లతో నిర్మించి డిజిటల్ విప్లవాన్ని తీసుకువచ్చారు.
●30న.. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్.కె.పాడులో హెచ్‌టీఎన్‌సీలో రూ. 1.5కోట్లతో అడ్వెంచర్ పార్క్‌ను ప్రారంభించారు.
ఫిబ్రవరి నెలలో...
●10వ తేదీన.. గ్రామాల్లో అభివృద్ధికి నాంది పలుకుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల్లో జిల్లాకు 15.80 కోట్లు మంజూరు చేశారు.
●11న.. గిరి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సికెల్‌సెల్ ఎనిమియాపై విద్యార్థులకు తనిఖీలు నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలందించారు.
●20న.. వైఎస్సార్ కళ్యాణ మస్తు, సాదీతోఫా కింద జిల్లాలో 172 వధూవరులకు రూ. 1.12 కోట్లు అందజేశారు.
●28న.. జిల్లాలోని 1,46,016 మంది రైతన్నలకు రైతు భరోసా పథకంకింద రూ.29.32కోట్లు రైతన్నల ఖాతాల్లో జమచేశారు.
మార్చి నెలలో..
●1వ తేదీ.. జగనన్న విద్యాదీవెన పథకం కింద 18,369 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.12.32కోట్లు నేరుగా జమచేశారు.
●2న.. పాచిపెంట మండలం రాయిగుడ్డివలస నుంచి బీరన్నదొరవలస వరకు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును అప్పటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభించారు.
●6న.. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద జిల్లాలో 256 మంది రైతులకు రూ. 14.75 లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు.
●8న.. వైఎస్సార్ చేయూత పథకం 4వ విడతలో భాగంగా 40–65 ఏళ్ల వయస్సు మధ్య గల 72,845 మంది మహిళలకు రూ. 136.60కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.
●11న.. కళ్యాణ మస్తు పథకం 4వ విడత ద్వారా 172మంది లబ్ధిదారులకు రూ.1.12కోట్లు నేరుగా వధూవరుల ఖాతాల్లో జమచేశారు.
●14వ తేదీ.. 60 నుంచి 40 ఏళ్ల వయస్సు గల మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా 3వ విడత కింద 1193మంది మహిళలకు రూ. 178.95లక్షలు వారి ఖాతాల్లో జమచేశారు.
Comments
Please login to add a commentAdd a comment