దుర్భిక్షం!
నేడు
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను పక్కన పెట్టి యూటర్న్ పాలిటిక్స్ విధానాన్ని అవలంభిస్తోంది. దీంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
సెప్టెంబర్ నెలలో..
●మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న హామీ అమల్లోకి రాలేదు.
●23వ తేదీ.. చిరు ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లతో వీఓఏలపై తొగించారు. నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
అక్టోబర్ నెలలో..
●3వ తేదీన.. నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ గ్రామాల్లో మద్యం షాపులు మాకొద్దంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు జిల్లా కేంద్రంలోని మహత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన
●22న.. విద్యా సంబంధిత పథకాలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని, తక్షణమే ప్రభుత్వ పథకాలు అందజేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలని ఆందోళన
●28న.. బడిదేవరకొండ గ్రానైట్ తవ్వకాలను రద్దుచేయాలని బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో ర్యాలీ..
నవంబర్ నెలలో...
●10వ తేదీ.. 104 ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌వద్ద నిరసన దీక్ష.
●16న... మినీ అంగన్‌డీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా మార్చాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా
●18న... ఆశవర్కర్లు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని, తమకు వేతనాలు పెంచాలని కలెక్టరేట్ వద్ద ధర్నా
●29వ తేదీ.. ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తూ బోధనేతర పనులు చేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభించింది. గజపతినగరంలో శిక్షణలో ఉపాధ్యాయుడు మృతి చెందడంతో పార్వతీ పురం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన
డిసెంబర్ నెలలో..
●13వ తేదీ.. రైతు భరోసా పథకాన్ని పేరుమార్చి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ. 20వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని కూటమి ప్రభుత్వం హామీలిచ్చింది. ఆరు నెలలు గడుస్తున్నా సాయం అందించక పోవడంతో వైఎస్సార్‌సీపీ ఆద్వర్యంలో అన్నదాతలకు అండగా కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
●27వ తేదీ.. కూటమిప్రభుత్వం వినియోగదారులకు వెన్నుపోటు పొడుస్తూ ఆరునెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో గల విద్యుత్ కార్యాలయాల వద్ద పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment