పరిహారం చెల్లింపులో అలసత్వం వద్దు
బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025
పార్వతీపురం: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడుల కేసుల్లో బాధితులకు త్వరగా నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో వాస్తవాలను తెలుసుకొని కేసులు నమోదుచేయాలన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు.
– జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గంజాయి పండించేవారికి ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేయాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఇంతవరకు 49 మందిని అదుపులోకి తీసుకొని 9 వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.
– హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదుచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్, ఏఎస్పీ సురానా అంకిత మహావీర్, డీఆర్‌ఓ కె.హేమలత, జిల్లా అటవీశాఖాధికారి జీఏపీ ప్రసూన, కమిటీ సభ్యులు డి. శాంతిరాజు, తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment