రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికై న ‘విఘ్నేష్’
తెర్లాం: రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు తెర్లాం మండలం ఎన్.బూర్జవలస గ్రామానికి చెందిన పైల విఘ్నేష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. అండర్–14 క్రికెట్ జట్టులో మొత్తం 18మంది క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయగా అందులో విఘ్నేష్ స్థానం సంపాదించడం విశేషం. మండలంలోని ఎన్.బూర్జవలస గ్రామసర్పంచ్ ప్రతినిధి పైల గణపతి కుమారుడు విఘ్నేష్. విఘ్నేష్‌కు చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఉన్న మక్కువతో అతనికి క్రికెట్ ఆటలో తర్ఫీదునిచ్చారు. ఇప్పటికే పలుమార్లు వివిధ కేటగిరీల్లో క్రికెట్ పోటీల్లో పాల్గొన్న విఘ్నేష్ బాగా రాణించాడు. అండర్–14 రాష్ట్ర జట్టు ఎంపికకు నిర్వహించిన సెలక్షన్‌లో కూడా విఘ్నేష్ మంచి ప్రతిభ కనబరచడంతో సెలక్టర్లు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్‌ను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు, మండలంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
ఆనందంగా ఉంది
రాష్ట్రస్థాయి అండర్–14 క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విజయనగరం జిల్లా నుంచి నేను ఒక్కడినే ఈ జట్టులో ఎంపికయ్యాను. చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆట నేర్చుకున్నాను. క్రికెట్ ఆటలో నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. క్రికెట్‌లో నాకు మెలకువలు నేర్పించిన నా కోచ్‌కు, తోటి క్రీడాకారులకు కృతజ్ఞతలు.
పైల విఘ్నేష్, క్రికెట్ క్రీడాకారుడు, ఎన్.బూర్జవలస, తెర్లాం మండలం
అండర్–14 జట్టులో స్థానం
Comments
Please login to add a commentAdd a comment