ఆలయ ప్రతిష్టను ఘనంగా నిర్వహించాలి
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని ట్రస్టు సభ్యులకు, దాతలకు గుజరాత్ రాష్ట్ర హైకోర్టు జడ్జి చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఆలయంలో జరుగుతున్న నిర్మాణపనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఆలయ ప్రతిష్టకు సంబంధించిన పోస్టర్‌ను పార్వతీపురం అడిషనల్ సెషన్స్ జడ్జి దామోదర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. అన్నిరకాల హంగులు, మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి దాతలు, భక్తులు భూరి విరాళాలను అందించి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రాంత విశిష్టతను చాటిచెప్పేందుకు ఆలయనిర్మాణం ఎంతో దోహదపడుతుందన్నారు. పార్వతీపురానికి చెందిన యిండుపూరు చినగుంప స్వామి ఆలయ నిర్మాణం కోసం రూ.లక్ష చెక్కును జడ్జి చేతులమీదుగా ట్రస్టు సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చుక్క భాస్కరరావు, డి.పారినాయుడు, ఎం.శ్రీరాములు, బీఎన్‌బీ రావు, జి.నాగభూషణరావు, సీఐ టి.వి.తిరుపతిరావు, ఎం.పకీరునాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఎం.సింహచలంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన గుజరాత్ రాష్ట్ర హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్
Comments
Please login to add a commentAdd a comment