జన్ మాన్ పనులు వేగవంతం చేయాలి
● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురం టౌన్: జన్ మాన్ పనులు వేగవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో పీఎం జన్ మాన్ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ మిషన్, అంగన్‌వాడీ, ఆవాస్ యోజన, రహదారులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలని ఆయనన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, ప్రాథమిక విద్య పట్ల ఆసక్తి కల్పించాలన్నారు. గిరిజన గ్రామాల్లో చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు. గిరిజనులందరికీ ఇళ్లు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి విజయగౌరి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం అవసరం
పార్వతీపురం: జిల్లాలో సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం అవసరం వుందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, కలెక్టర్‌లతో స్వచ్ఛతపై వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛత దిశగా తీర్చుదిద్దుతున్నట్లు తెలిపారు. దీనికోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ సలహదారు శ్రీనివాసన్ సహాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో వలంటీర్లును నియమించి స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురంలో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి నిర్దేశిత సంస్థ వచ్చి చేపట్టాల్సి వుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీసీ రోడ్లకు రూ.8 కోట్లతో ప్రతిపాదనలు
● పీఆర్ ఈఈ రమణమూర్తి
బొబ్బిలి: డివిజన్ పరిధి లోని మూడు నియోజకవర్గాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు పంచాయతీరాజ్ ఈఈ (ఎఫ్‌ఏసీ) టీవీ రమణమూర్తి తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. డివిజన్‌లో మరమ్మతులకు గురైన పీఆర్ తారు రోడ్లకు రూ.24 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో రూ.74 కోట్లతో 1047 పనులు చేపడుతున్నామన్నారు. పనులు జరు గుతున్నాయని చెప్పారు.
జాతరకు పోటెత్తిన జనం
గంట్యాడ: మండలంలోని కొఠారుబిల్లి జంక్షన్ దగ్గర గురువారం కనకదుర్గమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. జాతరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జాతరకు కొఠారుబిల్లితో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు తరలివచ్చారు. దీంతో జాతరలో పండగ సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment