స్మార్ట్ వైపు..!
శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
వడివడిగా..
రెండు కేటగిరీల్లో ఏర్పాటు
జిల్లాలో అన్ని కేటగిరీలూ కలిపి 2.84 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కేటగిరీ 2, 4 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ఈ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. తొలిగా దాదాపు 21 వేల మీటర్లను బిగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బలిజిపేట 350, గరుగుబిల్లి 15, కొమరాడ 28, పార్వతీపురం రూరల్ 267, పార్వతీపురం టౌన్ 253, సీతానగరం 105, జియ్యమ్మవలస 30, కురుపాం 25, పాచిపెంట 20, సాలూరు 111.. ఇలా దాదాపు 3 వేల వరకు మీటర్లను బిగించినట్లు అధికా రులు చెబుతున్నారు. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలకు ప్రస్తుతం ఉన్న విద్యుత్తు మీటర్లు తొలగించి, కొత్తగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యుత్తు బిల్లులు రీడింగ్ తీసుకోవడానికి ఏజెన్సీ సిబ్బంది ఇంటింటికీ వచ్చేవారు. ముద్రణ బిల్లును ఇచ్చేవారు. స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ తరహాలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రీచార్జి మాదిరి బిల్లు చెల్లించాల్సి వస్తుంది. వినియోగించుకున్న యూనిట్లకు సంబంధించి ముందుగా రీచార్జి చేసుకుంటేనే కరెంటు సరఫరా ఉంటుంది. ఇప్పటి వరకు బిల్లు చెల్లింపులో ఒక నెల ఆలస్యమైనా, పెనాల్టీతో చెల్లించే వెసులుబాటు ఉండేది.
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రస్తుతమున్న డిజిటల్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించేందుకు విద్యుత్తు శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలకు మీటర్ల బిగించే ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని కేటగిరీల్లోని గృహాలకూ ఏర్పాటు చేస్తోంది. మున్ముందు అన్ని కేటగిరీలనూ ఈ జాబితాలోకి చేర్చనుంది. ప్రస్తుతానికి వినియోగదారులకు ఉచితంగానే అందజేస్తున్నామని ఆ శాఖాధికారులు చెబుతున్నప్పటికీ.. మున్ముందు నెలవారీ బిల్లుల్లో ఆ మొత్తం కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే, ఎప్పుడో వినియోగించిన విద్యుత్తుకు ట్రూఅప్ చార్జీలు, ఇతర సర్ చార్జీలంటూ ఏవేవో కలిపి, మోయలేని భారం వేస్తున్నారని.. స్మార్ట్ మీటర్లు వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఏర్పాటు చేస్తున్నాం..
ఇదే విషయమై ఏపీఈపీడీసీఎల్ మన్యం జిల్లా ఎస్‌ఈ చలపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. కొన్ని కేటగిరీలకు సంబంధించి ఇప్పటికే 3 వేల వరకు స్మార్ట్ మీటర్లు బిగించామని చెప్పారు. మున్ముందు అన్ని కేటగిరీలకూ బిగించే అవకాశాలున్నాయని తెలిపారు. మీటరు కోసమైతే ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బులు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
న్యూస్‌రీల్
వినియోగదారుల్లో ఆందోళన
ఇప్పటికే ట్రూఅప్ చార్జీల పేరుతో గతంలో వాడుకున్న విద్యుత్తుకు సంబంధించి రెండు నెలలుగా వినియోగదారులపై అదనపు వడ్డన పడుతోంది. దీనికితోడు ఇతరత్రా చార్జీలంటూ బిల్లు తడిసిమోపెడవుతోంది. ఎస్సీ, ఎస్టీ రాయితీకీ మంగళం పాడారు. గతంలో సున్నా బిల్లు వచ్చే ఎస్టీలకు ఇప్పుడు ఒకేసారి రూ.2 వేలకు పైగా బిల్లు వస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే.. మొత్తం రాయితీకే ఎగనామం పెట్టే అవకాశం ఉందని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. సాధారణ వినియోగదారులు సైతం ఇప్పటికే పెరిగిన బిల్లులతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల కొనుగోలు, నిర్వహణ అంటూ అదనపు భారం వేస్తారని.. గతంలో ఎంత వినియోగిస్తున్నామో తెలిసేదని.. ఇప్పుడు ఆ మీటర్లు వస్తే లెక్కా..జమా... ఉండదని వాపోతున్నారు.
జిల్లాలో చురుగ్గా విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ
తొలిగా రెండు కేటగిరీల్లో ఏర్పాటు
ఇప్పటికే బిల్లుల భారంతో వినియోగదారుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment