రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
పాలకొండ రూరల్: మండలంలోని పనుకువలస కాలనీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అవలంగి గ్రామానికి చెందిన బి.వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డా డు. క్షతగాత్రుడు తన ద్విచక్రవాహనంపై వీరఘట్టం నుంచి స్వగ్రామం వస్తుండగా పాలకొండ నుంచి ఎదరుగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, ఆటోడ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపు!
పార్వతీపురం: అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 50 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అధికారం చేపట్టి ఏడు నెలల పూర్తయినా కొత్త పింఛన్ల ప్రస్తావనే లేదు. చాలామంది వితంతువులకు కూడా పింఛన్లు మంజూరుకాలేదు. 60 ఏళ్లు నిండిన వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారంటూ అర్హులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, కొత్త పింఛన్లు ఇంకా ఇవ్వడం లేదని, మళ్లీ రావాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చెబుతుండడంతో అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగేదని, నేడు ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం వెబ్‌సైట్ ఓపెన్ చేయకుండా కాలయాపన చేయడంపై మండిపడుతున్నారు. కొత్తగా వివాహాలైన వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
సజావుగా కానిస్టేబుల్
ఉద్యోగ నియామక ప్రక్రియ
విజయనగరం క్రైమ్: స్టైపెండరీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు సజావుగా సాగుతున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సోమవారం నిర్వహించిన పరీక్షలకు 651 మందికి 446 మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు. నియామక ప్రక్రియను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, పలువురు అధికారులు పర్యవేక్షించారు.
ఆర్‌ఎస్‌కే పరిశీలన
విజయనగరం ఫోర్ట్: రైతుల నుంచి బస్తాకు అదనంగా రెండు కేజీలు చొప్పన మిల్లర్లు వసూలు చేస్తున్నారనే అంశంపై ‘ఇదేం దోపి డీ..! శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ, సివిల్ సప్‌లై అధికారులు స్పందించారు. గంట్యాడ మండలంలోని సిరిపురం రైతు సేవా కేంద్రం (రైతు భరో సా కేంద్రం)ను సివిల్ సప్‌లై డీటీ మూర్తి, మండల వ్యవసాయ అధికారి బి.శ్యామ్‌కుమార్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు సంబంఽధించిన రికార్డులు, ట్రక్ షీట్లను తనిఖీచేశారు.
110 ఏళ్ల వృద్ధురాలు మృతి
గుర్ల: మండలంలోని రాగోలులో 110 ఏళ్ల వయస్సు గల వృద్ధురాలు దిండి రాములమ్మ సోమవారం మృతి చెందింది. ఆమె మృతి చెందిన వరకు ఎటువంటి అనార్యోగం దరి చేరలేదని కుటుంబ సభ్యులు తెలిపా రు. కరోనాను సైతం జయించిందంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో అత్యధిక వయస్కురాలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేశారు. మృతురాలికి ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment