31 నుంచి జాతీయ గణిత సదస్సు
విజయనగరం అర్బన్: జాతీయస్థాయి గణిత శాస్త్ర సదస్సును ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో ఎంఆర్ అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సాంబశివరావు తెలిపారు. స్థానిక కళాశాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సు పూర్తి వివరాల షెడ్యూల్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు సైన్స్ అకాడమీ ఆర్థిక సహకారంతో సదస్సు సాగుతుందన్నారు. చైన్నె మేథ్‌మెటిక్స్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ కరండికల్, రిసోర్స్ వర్సన్స్ కన్వీనర్‌గా, రిసోర్స్ పర్సన్స్‌గా ఐఎంఎస్ ప్రొఫెసర్ పాంచాలి, సీఎంఐ ప్రొఫెసర్ బి.వి.రామకృష్ణ, హనుమంతు మనోజ్ వ్యవహరిస్తారని తెలిపారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా గణిత శాస్త్రంలో వస్తున్న మార్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల గురించి వివరిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల గణిత శాస్త్ర విభాగాధిపతి ఎస్.సూరిబాబు, అధ్యాపకులు ఉమాశంకర్, ఝాన్సీ, స్వామినాయుడు, స్వాతి, రమేష్, శ్రీదేవి, ధర్మారావు, ఊర్మిల, సాంఖ్యక శాస్త్ర అధ్యాపకులు ఎం.వి.లక్ష్మి, నరేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ అచ్యుతరావు, సలహాదారు సూరినాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment