మరో బాదుడుకు సిద్ధం.. | - | Sakshi
Sakshi News home page

మరో బాదుడుకు సిద్ధం..

Published Tue, Jan 21 2025 12:50 AM | Last Updated on Tue, Jan 21 2025 12:50 AM

మరో బ

మరో బాదుడుకు సిద్ధం..

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి

భారీగా పెరగనున్న రిజిస్ట్ట్రేషన్‌ ధరలు

ఇప్పటికే పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

● జిల్లా పరిధిలో 13 రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

24వ తేదీ వరకు అభ్యంతరాలకు గడువు

జిల్లా కమిటీ ఆమోదం లాంఛనమే

విజయనగరం రూరల్‌: భూములు, స్థలాలు, నిర్మాణాల విలువలను అమాంతం పెంచేందుకు ప్రభు త్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబె ట్టి వరుసగా ప్రజలపై మోయలేని భారాలు మోపుతోంది. ఒకపక్క నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుంటే.. మరోపక్క విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజల నడ్డివిరిచిన కూటమి ప్రభు త్వం తాజాగా భూముల మార్కెట్‌ విలువ రిజిస్ట్రేష న్‌ చార్జీలను భారీగా పెంచేందుకు సిద్ధమైంది. 2025 నూతన సంవత్సర కానుకగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచనున్నట్లు సమాచారం.

పెరగనున్న ఆర్‌సీసీ నిర్మాణాల ధరలు

కొత్త నిబంధనల ప్రకారం ఆర్‌సీసీ నిర్మాణాల ధరలు భారీగా పెరగనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలోని అపార్ట్‌మెంట్‌లలో మొదటి, రెండవ అంతస్తులలో ప్లాటుకు ఒక్కో చదరపు గజానికి రూ.90 పెరగనుంది. ఇప్పటివరకు చదరపు అడుగుకు రిజిస్టేషన్‌ విలువ రూ.1400 ఉండగా దీన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రూ. 1490కి పెంచనున్నారు. కొన్ని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనూ చదరపు అడుగుకు రూ.70 పెంచుతున్నారు. మూడో అంతస్తు నుంచి మాత్రం గతంలో వసూలు చేసే రేట్లనే కొనసాగిస్తున్నారు. వాణిజ్య భవనాలకు మాత్రం గతంతో పోల్చిచూస్తే రిజిస్ట్రేషన్‌ విలువ రూ.100 పెరగనుంది. ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు..

ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా కూటమి ప్రభుత్వం జిల్లాలో భూములు విలువల పెంపునకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా అధికారులు పెంపు నివేదికలను సిద్ధం చేసి ముసాయిదాను జిల్లాలో ఉన్న 13 రిజిస్ట్రార్‌ కార్యాలయాల నోటీస్‌ బోర్డులో ఉంచారు. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 26న వాటిని పరిశీలిస్తారు. ఈ నెల 27న తుది జాబితాకు జిల్లా మార్కెట్‌ విలువల కమిటీ ఆమోదం తెలియజేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
మరో బాదుడుకు సిద్ధం..1
1/1

మరో బాదుడుకు సిద్ధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement