ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రసాద్
చీపురుపల్లి: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాసా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడీఎన్‌ఎస్‌వీ ప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థపై ముద్రించిన స్టాంప్స్, కవర్స్‌ను సేకరించి అవార్డును అందుకున్నారు. 2011 నుంచి 2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాల్లో రెడ్‌క్రాస్ సంస్థ పేరుతో విడుదలైన 1313 స్టాంప్స్, కవర్స్‌ను ప్రసాద్ సేకరించారు. దీనికి గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి మెడల్, ధ్రువీకరణ పత్రం, జ్ఞాపికను ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ డా.బిస్వరూప్ రాయ్ చౌదరి ప్రదానం చేశారు. ప్రసాద్ గతంలో కూడా బాపూజీపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్టాంప్స్ సేకరణలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
రెడ్‌క్రాస్‌పై విడుదలైన స్టాంప్స్ సేకరణతో గుర్తింపు
177 దేశాల్లో విడుదలైన స్టాంపులు, కవర్లు సేకరణ
గతంలో గాంధీజీపై స్టాంప్స్ సేకరణలో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment