ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారన్న ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. వెనుకబడిన మన్యం జిల్లా అభివృద్ధిని అసలు పట్టించుకోలేదు. కీలక రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. సామన్య ప్రజలకు అవసరమయ్యే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించకపోవడం సామాన్యుడికి పెనుభారమే. మొత్తంగా విదిల్చిన నిధులలో వచ్చినవే తప్ప.. ప్రత్యేకించి కేటాయింపులు లేకపోవడంతో జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.
వేతన జీవులకు కాస్త ఊరట
మధ్య తరగతి, వేతన జీవులకు ఈ బడ్జెట్‌లో కాస్త ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులూ చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. కొత్త పన్ను ప్రకటనతో ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి రూ.80 వేల వరకు మిగిలే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇది కాస్త వెసులుబాటు కలిగిస్తుంది.
● రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సేంద్రియ వ్యవసాయ సాగుకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. జిల్లాలో దాదాపు 55 వేల మంది రైతులు సుమారు 65 వేల ఎకరాల్లో సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. నిధులు కేటాయింపు చేస్తే మరింత ప్రోత్సాహం అందించినట్లవుతుంది.
● ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రాష్ట్రానికి రూ.162 కోట్లు కేటాయించారు. ఇందులో జిల్లాకు ఏ మేర ప్రయోజనం చేకూరుతుందన్నది చూడాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా ఆస్పత్రి సైతం కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. అధునాతన పరికరాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉంది. బడ్జెట్‌లో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నిధులు కేటాయించడంతో ఆ మేరకు ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
● అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ డే–కేర్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది అమలైతే జిల్లాతోపాటు, సమీపంలో ఉన్న ఒడిశా ప్రాంత వాసులకూ ఉపయోగమే. జిల్లాలో ఇప్పటి వరకు క్యాన్సర్‌కు సరైన వైద్య సేవలు అందుబాటులో లేవు. విశాఖపట్నం వెళ్లి చికిత్స పొందాల్సి వస్తోంది. కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా వీలు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
● కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వైద్య విద్యకు ప్రాధాన్యమిచ్చారు. దేశవ్యాప్తంగా వైద్యసీట్లను పెంచబోతున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు. ఇదే సమయంలో జిల్లాకు గత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల టెండర్లను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వైద్య కళాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే.. కేంద్ర తోడ్పాటు కూడా అంది జిల్లాలోని వైద్య విద్య అభ్యసించాలనుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో మేలు కలిగేది.
● రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు కేటాయించారు. విజయనగరం నుంచి జిల్లాకు వచ్చే అంతర్‌రాష్ట్ర రహదారిలో పారాది, సీతానగరం వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాత్కాలిక పనులు చేపడుతున్నా.. కంటితుడుపుగానే మిగులుతున్నాయి. ఇప్పుడు వచ్చే నిధులైనా కేటాయిస్తే వంతెనలకు మోక్షం కలిసి, ప్రయాణం సాఫీగా సాగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
●
న్యూస్‌రీల్
కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు శూన్యమే..
తోటపల్లికి రిక్తహస్తం
గుణుపూర్–అరకు రైల్వేలైన్ ఊసేలేదు
ఊరటనిచ్చే అంశాలు లేవంటున్న జిల్లావాసులు
Comments
Please login to add a commentAdd a comment