కొఠియాలో ఒడిశా అధికారుల తీరుపై నిరసన
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా –ఒడిశా కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా అధికారుల వేధింపులను నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మండలంలో కొఠియా గ్రూపు గ్రామాలైన దిగువశెంబి గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొఠియా సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ఇటీవల ఒడిశా అధికారులు, పోలీసులు దిగువశెంబి గ్రామంలో ఆంధ్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలోకి అక్రమంగా చొరబడి వస్తువులు తీసుకువెళ్లడం సరికాదన్నారు. ఇటువంటి చర్యల వల్ల రెండు రాష్ట్రాల మధ్య గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒడిశా ప్రభుత్వం దూకుడుకు అడ్డుకట్ట వేయాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేవారు. ఏపీలో ప్రభుత్వం గిరిజనులకు రక్షణ కల్పించాలని, సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. లేకుంటో ఆందోళన చేపడతామన్నారు. నిరసనలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment