ఫీజు పోరుకు సన్నద్ధం
పార్వతీపురంటౌన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్వంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పష్టంచేశారు. తన స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ నెల 5న తలపెట్టనున్న ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడులచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ రోజు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. మూడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా రాక్షసత్వం చూపడంపై మండిపడ్డారు. అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువుల కలలను ప్రభుత్వం అడియాశలు చేస్తోందన్నారు. విద్యార్థులకు తక్షణమే రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదలకు డిమాండ్
ఈ నెల 5న జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా
పోస్టర్‌ను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే జోగారావు
Comments
Please login to add a commentAdd a comment