కేరళకు రైతు బృందం
సీతంపేట: కేరళలో సాగు చేస్తున్న మారిషస్ పైనాపిల్ పంట క్షేత్ర స్థాయి పరిశీలనకు గిరిజన రైతు బృందం శనివారం పయనమైంది. వారు వెళ్లేబస్సుకు సీతంపేటలో ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పచ్చజెండా ఊపారు. బృందంలో సీతంపేట, భామిని మండలానికి చెందిన 36 మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరంతా పైనాపిల్ సాగుతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించనున్నారు. గిరిజన రైతులతో పీహెచ్‌ఓ వెంకట గణేష్, హెచ్‌ఓ జయశ్రీ, హెచ్‌ఓలు దివాకర్, కావ్య ఉన్నారు.
5న సీతంపేటలో జాబ్ మేళా
సీతంపేట: స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ నెల 5న సీతంపేట వైటీసీలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ ఆపరేటర్, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు అర్హులన్నారు. జాబ్ మేళాలో 6 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 400 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసి విశాఖపట్నం, గుంటూ రు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు.
పాఠశాలల మిళితంపై పునఃపరిశీలన
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: ప్రభుత్వ పాఠశాలల మిళితంపై ఇప్పటికే తయారుచేసిన నివేదికను పునఃపరిశీలించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులలో సామాజిక అంతరాలు తొలగించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండేలా మిళితం చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి మంచి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. పాఠశాలలు మిళితం చేసే అంశాన్ని ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి నడుచుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, ఉప విద్యాశాఖ అధికారులు డి.రాజ్‌కుమార్, పి.కృష్ణమూర్తినాయుడు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.
నాయకుల సేవలో పోలీసులు!
మెంటాడ: ప్రస్తుతం జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీనిని అమలుచేయాల్సిన పోలీస్ అధికారి అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. ఓ ఇద్దరు టీడీపీ నాయకులను నేరుగా తన వాహనంలో మంత్రి ఇంటివరకు తీసుకెళ్లడం, వారి మన్ననల కోసం తాపత్రయ పడాన్ని చూసిన ప్రజలు ముక్కునవేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయ డంతో ఎస్‌ఐ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నాయకులను వెంటబెట్టుకుని మంత్రి వద్దకు వెళ్లారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమి ‘రామ’భక్తి అంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment