సత్తా చాటిన దివ్యాంగుల క్రికెట్ జట్టు
● గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో పోటీల నిర్వహణ
భామిని: పార్వతీపురం మన్యం జిల్లా దివ్యాంగ క్రికెట్ జట్టు రాష్ట్ర క్రికెట్ పోటీలలో సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచింది. గుంటూరులోని విజ్ఞాన యూనివర్సిటీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల–7,8 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా దివ్యాంగ జట్టు కెప్టెన్ కేవటి శ్రీను ఆధ్వర్యంలో టీమ్ ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీ, నగదు బహుమతి అందుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న 2024 పారా ఓలెంపిక్ భ్రౌంగ్ మెడలిస్ట్, ఇండియన్ పారామిలటరీ పిస్టల్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ఈ జట్టులో అత్యధింకంగా భామిని మండలానికి చెందిన వారే ఉన్నారు. కెప్టెన్ కేవటి శ్రీను(నేరడి–బి), వలరౌతు డిల్లీశ్వరరావు(కీసర), గౌడో సంతోష్(కాట్రగడ–బి), రాయవలస వినోద్ (గురండి), బాణాల నరేష్(పాలకొండ)తో పాటు 11 మంది జిల్లా క్రీడాకారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment