చిన్నారులకు పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు పునర్జన్మ

Published Mon, Nov 18 2024 12:53 AM | Last Updated on Mon, Nov 18 2024 1:42 AM

చిన్న

చిన్నారులకు పునర్జన్మ

● రంగాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మనుశ్రీకి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు శస్త్రచికిత్స చేయించారు. పైసా ఖర్చులేకుండా గుండె జబ్బుకు ఆపరేషన్‌ చేయించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

● ఆర్‌బీఎస్‌కే బృందాలు మూడు నెలల్లో 26మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్స చేయించేలా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవ చూపారు.

పెద్దపల్లిరూరల్‌: పేద చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ అందించడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రీయ్‌ బాల స్వస్థీయ కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) అమలు చేస్తోంది. జిల్లాలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఈ పథకం ద్వారా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. తద్వారా వారికి పునర్జన్మనిస్తున్నారు. గత నాలుగు నెలల్లోనే 36 మంది చిన్నారులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అందులో 26 మందికి ఆపరేషన్లు చేయించారు. పేదరికంలో మగ్గుతున్న వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో మరో నలుగురు చిన్నారులకు చికిత్స చేయిస్తున్నామని ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

ఆరోగ్య లోపాలు గుర్తించేందుకు..

జిల్లాగా అవతరించాక తొలి కలెక్టర్‌ అలుగు వర్షిణి ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌ స్యూళ్లలో చదివే టీ నేజీ పిల్లల్లో వ్యాధులు, ఆరోగ్యపరమైన లోపాలను గుర్తించేందుకు ఆర్‌బీఎస్‌కే వైద్యబృందాలను నియమించారు. వీరికోసం 10 వాహనాలు సమకూర్చా రు. మహిళా సంఘాల ద్వారా వాహనాలు కొనుగో లు చేయించారు. అద్దె ప్రాతిపదికన ఆర్‌బీఎస్‌కేకు సమకూర్చారు. అప్పట్నుంచి వైద్యబృందం కిట్లతో పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్స్‌ ఉంటారు. ఆర్‌బీఎస్‌కే ద్వారా నిర్ధారించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, పేరొందిన ప్రైవేట్‌ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు.

తల్లిదండ్రులు వస్తే మేలు

పుట్టుకతోనే సంక్రమించే 32 రకాల వ్యాధులను చిన్నతనంలోనే గుర్తించి చికిత్స అందించేందుకు కేంద్రప్రభుత్వం 2013 ఫిబ్రవరి 6న ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య కార్యక్రమ్‌) అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఆర్‌బీఎస్‌కే వైద్యబృందాలు అంగన్‌వాడీ, ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తున్నాయి. వైద్యబృందాల పర్యటన సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందుగానే అందిస్తున్నారు. అయితే, తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది.. నేరుగా విద్యార్థులనే సమస్య అడిగి వైద్య పరీక్ష చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆపరేషన్లు

కలెక్టర్‌ చొరవతో బాలబాలికలకు మెరుగైన వైద్యం

పిల్లలకు మంచి భవిష్యత్‌

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే పేద పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించడం లక్ష్యంగా జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌బీఎస్‌కే ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఇందుకోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి శస్త్రచికిత్సలు చేయిస్తున్న డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌కే మొబైల్‌ హెల్త్‌టీంకు అభినందనలు.

– కోయ శ్రీహర్ష, కలెక్టర్‌

సంతోషంగా ఉన్నాం

మా బాబు ఏడాది నుంచే ఏదోసమస్యతో బాధపడుతున్నడు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. అప్పులపాలైనం. ఆర్‌బీఎస్‌కే వాళ్లు వైద్యశిబారినిక తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు.. గుండె సంబంధిత వ్యాధి ఉందని నిర్ధారించి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించారు. నేను ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ను. పేదరికం. నయాపైసా ఖర్చు లేకుండా సర్జరీ చేయించిండ్రు. నాలుగేళ్ల బాబుకు పునర్జన్మ ఇచ్చిండ్రు. సంతోషంగా ఉంది.

– అఫ్సానా, అబ్దుల్‌ హసన్‌ తల్లి

ఈ విద్యార్థిని పేరు ఐశ్వర్య. మంథని మండలం వెంకట్రావుపల్లి స్వగ్రామం. అదేఊరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటోంది. ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం పరీక్షించి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించింది. తల్లిదండ్రులతో మాట్లాడి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించింది. ఇటీవల ఉచితంగా శస్త్రచికిత్స చేయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
చిన్నారులకు పునర్జన్మ1
1/2

చిన్నారులకు పునర్జన్మ

చిన్నారులకు పునర్జన్మ2
2/2

చిన్నారులకు పునర్జన్మ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement