గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన గ్రూప్–3 పరీక్ష లు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పట్టణంలోని ట్రినిటి డిగ్రీ కాలేజీ, రామగిరి జేఎన్టీయూలోని పరీక్ష కేంద్రాల ను కలెక్టర్ సందర్శించి పరీక్ష నిర్వహణను తీరును పర్యవేక్షించారు. మొత్తం 18 పరీక్ష కేంద్రాల్లో 8,947 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, ఉ దయం జరిగిన ఫస్ట్ పేపర్‌కు 4,557 మంది హాజరయ్యారు. అలాగే సెకండ్ సెషన్‌లో 4,440 మంది అ భ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్ వివరించారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పరీక్ష ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అభ్య ర్థులు నిబంధనలు పాటించాలని సూచించారు.
సుల్తానాబాద్‌లో..
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక శ్రీవాణి జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నిర్దేశిత సమయం ముగిశాక వచ్చిన నలుగురిని అధికారులు అనుమతించలేదు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
రామగిరి(మంథని): సెంటినరీకాలనీ జేఎన్టీయూ పరీక్ష కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడ్మిన్ డీసీసీ రాజు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, టీజీపీఎస్‌సీకి చెందిన ఇద్దరు పరిశీలకులు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
గోదావరిఖనిలో..
గోదావరిఖనిటౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అశోక్‌నగర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్, మార్కండేయకాలనీ చైతన్న డిగ్రీ, పీజీ కళాశాల, శారదనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఎన్టీపీసీలోని సెయింట్ క్లేర్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్రూప్–3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు నుంచే అభ్యర్థులను పరీక్షహాల్‌లోకి అనుమతించారు. ఉదయం 9.30 గంటల తర్వాత అభ్యర్ధులను అనుమతించలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన ఏడుగురు అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
ఆరుగురు ఆలస్యం..
జ్యోతినగర్(రామగుండం): జెడ్పీ హైస్కూల్‌లో 274 మందికి 109 మంది, సెయింట్ క్లేర్ హైస్కూ ల్‌లో 480 మందికి 307 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సెయింట్ క్లేర్ సెంటర్‌కు ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను పోలీసులు గేటు వద్ద నిలిపివేశారు. దీంతో వారు నిరాశతో వె నుదిరి పోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ఎన్టీపీసీ ఎస్సై సతీశ్ తమ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 4,557మంది, మధ్యాహ్నం 4,440 మంది అభ్యర్థులు హాజరు
Comments
Please login to add a commentAdd a comment