రైతులకు బోనస్ చెల్లిస్తాం
రామగుండం/ఫెర్టిలైజర్‌సిటీ: సన్నరకం ధా న్యం విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ. 500లను త్వరలోనే చెల్లిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. పెద్దంపేట, ఎల్కలపల్లిలో ఆదివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశా రు. కాంగ్రెస్ మండల ఇన్‌చార్జి పెండ్రు హన్మాన్‌రెడ్డి, నాయకులు ఉరిమెట్ల రాజలింగం, సింగం కిరణ్‌కుమార్‌గౌడ్, మేర్గు కుమార్‌గౌడ్, పూ దరి సత్తయ్యగౌడ్, ఆముల శ్రీనివాస్, తమ్మనవేణి కుమార్, కొండ వెంకటస్వామిగౌడ్, తూ ళ్ల రాములు, గోపాల్‌యాదవ్, మనోహర్‌రెడి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఖాతాల్లో జమచేస్తాం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌ను త్వరలోనే రై తుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగపేట, కూనారం గ్రామాల్లో ఆదివారం ఆ యన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో రైతుల కు ఇబ్బందులు లేకుండా, వడ్లలో కోత లేకుండా తూకం వేస్తున్నామని తెలిపారు. దళాలరు ను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. సింగిల్‌విండో చైర్మన్ పురుషోత్తం, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, నాయకులు మొగిలి, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
‘రామగుండంలో పోలీసు పాలన’
గోదావరిఖని: రామగుండంలో ప్రజాపాలనకు బదులు పోలీసు పాలన నడుస్తోందని బీఆర్‌ఎ స్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ప్రజా సమస్యలపై తాము బల్దియా కార్యాలయంలో నిరసన తెలిపితే ఎమ్మెల్యే రా జ్‌ఠాకూర్ బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులతో కేసు లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మహి ళా కార్పొరేటర్లు, దళిత మహిళలను సీఐ దు ర్భాషలాడడం దుర్మార్గమన్నారు. డిప్యూటీ మే యర్ నడిపెల్లి అభిషేక్‌రావు మాట్లాడారు. నా యకులు అముల నారాయణ, కల్వచర్ల కృష్ణవే ణి, కవితాసరోజిని, నూతి తిరుపతి, పిల్లి రమే శ్, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారు తి, అచ్చే వేణు, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్, జాహిద్‌పాషా, నీరటి శ్రీనివాస్, కిరణ్‌జీ, రమ్యయాదవ్, ముద్దసాని సంధ్యారెడ్డి, గుర్రం పద్మ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజలను ఆగం చేస్తున్నారు’
కమాన్‌పూర్(మంథని): కాంగ్రెస్ అధికారంలో కి వచ్చి ఏడాది కావొస్తున్నా ఆరు గ్యారంటీల ను అమలు చేయకుండా ప్రజలను ఆగం చే స్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ప్రజావంచన నిరసన ప్రదర్శన చేపట్టారు. మధు మాట్లాడుతూ, మేనిఫెస్టో క మిటీ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే సంక్షేమ పథకా ల అమలులో విఫలమయ్యారని విమర్శించా రు. నాయకులు తాటికొండ శంకర్, బొమ్మగా ని అనిల్, మేకల సంపత్, కొండ వెంకటేశ్, ఉప్పరి శ్రీనివాస్, పొన్నం రాజేశ్వరి, నల్లగొండ నాగరాజు, గుర్రం లక్ష్మీమల్లు, చిందం తిరుప తి, నీలం శ్రీనివాస్, సాయికుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
గోదావరిఖని: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 19న స్థానిక డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రామికభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment