ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రాణాంతకం
కరీంనగర్‌టౌన్: ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రాణాంతకమని, తక్కువ మందికే వస్తున్నప్పటికీ, దీని నుంచి బయటపడటం అసాధ్యమని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ప్యాంక్రియాటిక్ కేన్సర్ డే సందర్భంగా గురువారం కరీంనగర్‌లోని దవాఖానాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్యాంక్రియాటిస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని, షుగర్‌ను సమతుల్యంగా ఉంచుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో అన్నం అరగకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, జాండిస్, డిప్రెషన్, డయాబెటిస్, వాంతులు, వెన్ను, నడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తిన్న వెంటనే పొట్టలో, బొడ్డుపై నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని భావించి, సొంత వైద్యం చేసుకోకుండా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు దిలీప్‌రెడ్డి, ప్రణీత్, నటరాజ్, వినయ్‌కుమార్, రవిమల్లారెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment