సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆసరా
ధర్మారం(ధర్మపురి): సీఎం సహాయనిధి పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వ వి ప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 19 మంది లబ్ధిదారులకు రూ.25.77 లక్షల విలువైన చెక్కులను ఆ యన అందజేశారు. బొమ్మారెడ్డిపల్లి హన్మాన్ దేవాయలం– కొత్తపల్లి పంచాయతీ వరకు రూ.1.30 కో ట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాధిహామీ ద్వారా యాదవకులకు మంజూరైన గొర్రెల షెడ్లకు భూమిపూజచేశారు. విప్ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, బ్లాక్– 2 అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బద్దం అజయ్‌పాల్‌రెడ్డి, కోమటిరెడ్డి దేవెందర్‌రెడ్డి, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment