హక్కులు, విధులపై అవగాహన అవసరం
పెద్దపల్లిరూరల్: భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, బాధ్యతలపై ప్రతీపౌరుడికి కనీస అవగాహన అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంత్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కాలేజీలో మంగళవారం జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, జూనియర్ సివిల్‌జడ్జి మంజుతో కలిసి జడ్జి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం విధులు, హక్కుల గురించి వివరించారు. ప్రిన్సిపల్ మైత్రేయి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్, డీవీ ఎస్‌మూర్తి, శ్రీనివాస్, సంకీర్త, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
గోదావరిఖనిటౌన్: భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్‌రెడ్డి అన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. అందరికీ సమన్యాయం, సమానహక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం తయారు చేశారని అన్నారు. గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటమ్ సతీశ్, ప్రతినిధులు జి.ప్రకాశ్, మహేందర్, వరలక్ష్మి, గొర్రె రమేశ్, చందాల శైలజ, సిరిగ సంజయ్‌కుమార్, శ్రీనివాసరావు, ఉమర్, కుమార్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment