గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
గోదావరిఖని: గంజాయి విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రూ1.30 కోట్ల విలువైన 521.54 కిలోల గంజాయిని కమిషనరేట్‌లో కాల్చివేసినట్లు సీపీ మంగళవారం తెలిపారు. కమిషరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మూడేళ్లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కోర్టు అనుమతితో కాల్చివేశామని ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో నిత్యం తనిఖీలు విస్తృతం చేశామని ఆయన తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్), స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, జైపూర్, టాస్క్‌ఫోర్స్, ఏఆర్ ఏసీపీలు రాజు, రాఘవేంద్రరావు, రమేశ్, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, సుందర్‌రావు, సీసీఆర్‌బీ సీఐ సతీశ్, ఆర్‌ఐలు దామోదర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
రూ.1.30కోట్ల గంజాయి కాల్చివేత
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment