ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన
రామగిరి(మంథని): రత్నాపూర్ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టీజీ ఐఐసీ కరీంనగర్ జోనల్ మేనేజర్ పద్మజ మంగళవారం స్థల పరిశీలన చేశారు. పార్క్ కోసం సుమారు 218 ఎకరాలు అవసరమని అధికారులు తెలిపారు. రామగిరిఖిల్లా ప్రాంతంలో సుమారు 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ సందర్భంగా పద్మజ పరిశీలించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు ఇవ్వాలనే ప్రతిపాదనల మేరకు పరిశ్రమలు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేశారని తెలిసింది. కాగా, రామగిరిలో కోకాకోలా కంపెనీ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. టీజీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ మహేశ్, తహసీల్దార్ రాంచందర్‌రావు, జిల్లా సర్వేయర్ గణపతి, ఆర్ఐ మహేశ్, సీనియర్ అసిస్టెంట్ సంపత్, మండల సర్వేయర్ రాధిక, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రంజిత, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment